అహ్మాదాబాద్: వరల్డ్‌కప్‌లో భాగంగా మరికొన్ని గంటల్లో హైవోల్టేజ్ ఇండోపాక్(India vs Pakistan) మ్యాచ్ జరగనున్నది. అహ్మాదాబాద్ వేదికగా ఈ మ్యాచ్ మధ్యాహ్నం ప్రారంభంకానున్నది. ఇవాళ అక్కడ వెదర్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఆకాశంలో ఇవాళ స్వల్పంగా మేఘాలు ఉండే ఛాన్సు ఉంది. పగటి పూట ఎండ, మబ్బులు ఉంటాయి. వర్షం పడే ఛాన్సు ఒక్క శాతం మాత్రమే ఉన్నట్లు వాతావరణశాఖ నిపుణులు చెబుతున్నారు. పగటి పూట సుమారు 14 శాతం మేఘాలు ఉండే అవకాశం ఉంది. ఇక రాత్రి పూట ఆ మేఘాలు రెండు శాతానికి పడిపోనున్నాయి. నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్‌కు ఎటువంటి వెదర్ ఆటంకం ఉండదని వాతావరణ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.