భారత్, ఇంగ్లండ్ ఆఖరి టెస్టు రీషెడ్యూల్

లండన్: కరోనా కేసుల కారణంగా భారత్, ఇంగ్లండ్ మధ్య అర్ధాంతరంగా నిలిచిపోయిన ఐదో టెస్టును వచ్చే ఏడాది నిర్వహించనున్నట్లు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) శుక్రవారం స్పష్టం చేసింది. ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం ఈ ఏడాది ఇంగ్లండ్ వెళ్లిన టీమ్ఇండియా.. నాలుగు మ్యాచ్‌ల తర్వాత కరోనా కలకలంతో ఆఖరి టెస్టు ఆడకుండానే ఐపీఎల్ కోసం యూఏఈలో అడుగుపెట్టింది. వచ్చే ఏడాది జూలైలో పరిమిత ఓవర్ల సిరీస్‌లు ఆడేందుకు భారత జట్టు ఇంగ్లండ్ వెళ్లనుండగా.. అదే సమయంలో ఈ మ్యాచ్‌ను నిర్వహించాలని నిర్ణయించినట్లు ఈసీబీ తెలిపింది. ఇప్పటి వరకు జరిగిన నాలుగు మ్యాచ్‌ల్లో కోహ్లీసేన 2-1తో ఆధిక్యంలో ఉండగా.. ఆఖరి టెస్టు వచ్చే ఏడాది జూలై 1 నుంచి ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగనుంది. ‘ఇరు దేశాల బోర్డులు చర్చించుకున్న తర్వాతే అర్ధాంతరంగా నిలిచిపోయిన టెస్టు ను తిరిగి నిర్వహించాలని నిర్ణయించాం’ అని ఈసీబీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ టెస్టు అనంతరం భారత్, ఇంగ్లండ్ మధ్య జూలై 7, 9, 10న మూడు టీ20లు.. జూలై 12, 14, 17న మూడు వన్డేలు నిర్వహించనున్నట్లు పేర్కొంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.30 వేల నష్ట పరిహారం చెల్లించాలి’
Gang Rape Survivor’s Father Killed | అత్యాచారం కేసు వెనక్కి తీసుకునేందుకు నిరాకరణ.. బాధితురాలి తండ్రిని హత్య చేసిన నిందితులు
Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

