ఢిల్లీ: భారత టెన్నిస్ సింగిల్స్ ఆశాకిరణం సుమిత్ నాగల్ ఏటీపీ ర్యాంకింగ్స్లో మున్ముందుకు దూసుకెళ్తున్నాడు. గతవారం కెరీర్ బెస్ట్ (77) ర్యాంకు సాధించిన నాగల్.. తాజాగా పెరుగియా చాలెంజర్ టోర్నీ ఫైనల్ చేరడంతో ఆరు స్థానాలు మెరుగుపరుచుకుని 71వ ర్యాంకుకు చేరాడు. ఇదే అతడికి కెరీర్ బెస్ట్ ర్యాంకు కావడం విశేషం.