Virat Kohli : రాంచీ వన్డేలో కుర్రాడిలా చెలరేగిన విరాట్ కోహ్లీ (Virat Kohli) ఖతర్నాక్ శతకంతో అభిమానులకు పూనకాలు తెప్పించాడు. 37 ఏళ్ల వయసులోనూ అప్పుడే జట్టులోకి వచ్చిన ఆటగాడిలా హుషారైన ఇన్నింగ్స్ ఆడిన విరాట్ భారత ఆటగాళ్లను సైతం ఉర్రూతలూగించాడు. దక్షిణాఫ్రికా బౌలర్లకు దడపుట్టిస్తూ ఏడు సిక్సర్లతో కోహ్లీ సృష్టించిన విధ్వంసాన్ని మాజీలు వేనోళ్ల కొనియాడుతున్నారు. ఇక టీమిండియా స్టార్స్ అయితే కోహ్లీ సూపర్ సెంచరీకి తాము ఫిదా అయిపోయామని, ఆ ఇన్నింగ్స్ చూశాక ఓ తొమ్మిదేళ్లు వెనక్కి వెళ్లినట్టు అనిపించిందని చెబుతున్నారు.
వన్డేల్లో తనకు తానే సాటి అని చాటుకుంటూ శతకాల మోత మోగిస్తున్నాడు కోహ్లీ. రెండేళ్ల క్రితం వన్డే వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్‌పై సెంచరీతో సచిన్ టెండూల్కర్ రికార్డు బ్రేక్ చేసిన విరాట్.. తాజాగా సఫారీలపై విరుచుకుపడి 52వ శతకం సాధించాడు. రాంచీలో కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్ ఆద్యంతం అద్భుతంగా సాగింది. అతడి ఆటకు అభిమానులే కాదు సహచరులు మస్త్ ఖుషీ అయిపోయారనుకో. స్పిన్నర్ కుల్దీప్ మాట్లాడుతూ.. నా కెరీర్ కోహ్లీ కెప్టెన్సీలోనే మొదలైంది. రాంచీలో అతడు ఆడిన విధ్వంసక ఇన్నింగ్స్ చూశాక నేను మరో 8-9 ఏళ్లు వెనక్కి వెళ్లినట్టు అనిపించింది.
Kuldeep Yadav talks about the greatness of Virat Kohli. 🐐#Cricket #ODI #Kohli pic.twitter.com/FhUXBjR4Bd
— Sportskeeda (@Sportskeeda) December 1, 2025
“𝗔𝘄𝗮𝗿𝗲 & 𝗹𝗼𝗼𝗸𝗶𝗻𝗴 𝘁𝗼 𝗴𝗲𝘁 𝗯𝗲𝘁𝘁𝗲𝗿 𝗲𝘃𝗲𝗿𝘆 𝘀𝗶𝗻𝗴𝗹𝗲 𝗱𝗮𝘆”
Virat Kohli on the mental phase he is at at this point of time.#TeamIndia | #INDvSA | @imVkohli | @IDFCFIRSTBank pic.twitter.com/j5Nl6ihXQN
— BCCI (@BCCI) December 1, 2025
అవును.. 2017-18, 2019లో విరాట్ ఇలానే చెలరేగి ఆడేవాడు. రాంచీ వన్డేలో కోహ్లీ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆసాంతం ఎంతో ఆత్మవిశ్వాసంగా కనిపించిన అతడి షాట్ సెలక్షన్ అమోఘం. అనుభవజ్ఞుడైన అతడి నుంచి చాలా విషయాలు నేర్చోకోవచ్చు. మైదానంలో కోహ్లీ ఉంటే ఆ ఎనర్జీయే వేరు అని అన్నాడు.
కోహ్లీ ఇన్నింగ్స్‌పై యువ ఆటగాడు తిలక్ వర్మ సైతం ప్రశంసలు కురిపించాడు. విరాట్ వన్డేల్లో ఆడిన గొప్ప ఇన్నింగ్స్‌లో రాంచీ సెంచరీ ఒకటని ఈ తెలుగు కుర్రాడు కితాబిచ్చాడు. ‘మేము మరో అత్యుత్తమ ఇన్నింగ్స్ చూశాం. కోహ్లీ సెంచరీ కొట్టడం ప్రత్యక్షంగా చూసినందుకు చాలా సంతోషంగా ఉంది. కొన్నేళ్లుగా విరాట్ మైదానంలో చిరుతలా కదులుతున్నాడు. అతడితో మాట్లాడి చాలా విషయాలు నేర్చుకున్నా’ అని తిలక్ చెప్పాడు. టీ20 సంచలనమైన ఈ హైదరాబాదీ కుర్రాడు ఇటీవలే ఆసియా కప్ ఫైనల్లో మెరుపు అర్ధ శతకంతో టీమిండియాను గెలిపించాడు.
Tilak Varma said, “Watching Virat bhai score a hundred live was a special feeling. It was pure joy seeing him bat, and I’m learning so much from him every day.”💗 pic.twitter.com/NTE9nNkS7L
— Pankaj (@downloadedx8) December 1, 2025
కోహ్లీ వన్డేల్లో 52వ సారి మూడంకెల స్కోర్ అందుకొని అంతర్జాతీయ క్రికెట్ ఒక ఫార్మాట్లో అత్యధిక సెంచరీతో చరిత్ర సృష్టించాడు. ప్రస్తుతం విరాట్ అన్ని ఫార్మాట్లలో కలిపి 83 సెంచరీలు సాధించాడు. మొత్తంగా అంతర్జాతీయ క్రికెట్లో 7 వేల శతకం కోహ్లీ సాధించడం విశేషం. సచిన్ 100 శతకాలతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. క్రికెట్ గాడ్ అయిన సచిన్ టెస్టుల్లో 51, వన్డేల్లో 49 సార్లు మూడంకెల స్కోర్ నమోదు చేశాడు.