Asian Games | హర్మన్‌ప్రీత్‌కు మరో అవకాశం.. ఆసియా క్రీడలకు 17 ఏళ్ల వికెట్ కీపర్..!
Asian Games : వరల్డ్‌కప్‌లో జట్టును సెమీస్ చేర్చలేకపోయినప్పటికీ హర్మన్‌ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur)నే కెప్టెన్‌గా కొనసాగిస్తూ 15 మందితో కూడిన బృందాన్ని ఎంపిక చేశారు.
Asian Games : మహిళల టీ20 ప్రపంచకప్‌లో నిరాశపరిచిన భారత జట్టు మరో మెగా టోర్నీకి సిద్ధమవుతోంది. జపాన్ ఆతిథ్యమిస్తున్న ఆసియా క్రీడల్లో(Asian Games 2026) టీమిండియా బరిలోకి దిగనుంది. సెప్టెంబర్‌లో జరిగే ఈ టోర్నీ కోసం మంగళవారం సెలెక్టర్లు స్క్వాడ్‌ను ప్రకటించారు. వరల్డ్‌కప్‌లో జట్టును సెమీస్ చేర్చలేకపోయినప్పటికీ హర్మన్‌ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur)నే కెప్టెన్‌గా కొనసాగిస్తూ 15 మందితో కూడిన బృందాన్ని ఎంపిక చేశారు. వీరిలో 17 ఏళ్ల వికెట్ కీపర్, బ్యాటర్ జి.కమలిని కూడా ఉంది. ఊహించినట్టుగానే ప్రపంచకప్‌లో ఘోరంగా విఫలమైన యస్తికా భాటియాపై వేటు పడింది.
వచ్చే సెప్టెంబర్‌లో జరుగబోయే ఆసియా క్రీడల కోసం భారత మహిళా సెలక్టర్లు స్క్వాడ్‌ను ప్రకటించారు. టీ20 ప్రపంచకప్‌లో టీమిండియాను సెమీస్ వరకైనా తీసుకెళ్లని హర్మన్‌ప్రీత్ కౌర్‌పై మరోసారి నమ్మకం ఉంచుతూ.. ఆమెనే కెప్టెన్‌గా కొనసాగించారు. వరల్డ్‌కప్ పోటీలకు ఎంపికైన స్క్వాడ్‌లో ఒకేఒక మార్పు చేశారు సెలెక్టర్లు. మెగా ఈవెంట్లో తీవ్రంగా నిరాశపరిచిన యస్తికా భాటియాను తప్పించి.. జి.కమలినికి చోటు కల్పించారు.
🚨 News 🚨
India Women’s squad announced for the 2026 #AsianGames in September.
More Details ▶️ https://t.co/JagEsizajH#TeamIndia pic.twitter.com/jJGddVSr17
— BCCI Women (@BCCIWomen) June 30, 2026
ఇటీవల ఇంగ్లండ్‌లో భారత ఏ జట్టు తరఫున కమలిని 35 పరుగులతో అజేయంగా నిలిచింది. అంతేకాదు.. అండర్-19 మహిళల వరల్డ్‌కప్‌లో అత్యధిక పరుగులు చేసిన మూడో బ్యాటర్‌గా నిలిచిందీ వికెట్ కీపర్ దాంతో.. దూకుడుగా ఆడగల కమలినికి ఆసియా గేమ్స్ స్క్వాడ్‌లోకి తీసుకున్నారు. అలానే.. కాలి మడిమ గాయంతో వరల్డ్‌కప్ నుంచి వైదొలిగిన శ్రేయాంక పాటిల్‌కు 15 మంది బృందంలో చోటు దక్కింది. కానీ, తుది జట్టులో ఎంపిక విషయానికొస్తే.. ఫిట్‌నెస్‌పై ఆధారపడి శ్రేయాంకను ఆడించే అవకాశముంది. నిరుడు చైనాలోని హంగ్జైలో జరిగిన ఆసియా క్రీడల్లో పసిడి పతకం కొల్లగొట్టిన టీమిండియా ఈసారి.. మళ్లీ విజేతగా నిలవాలనే కసితో ఉంది.
భారత స్క్వాడ్ : హర్మన్‌ప్రీత్‌కౌర్(కెప్టెన్), స్మృతి మంధాన(వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రీచా ఘోష్(వికెట్ కీపర్), జి.కమలిని(వికెట్ కీపర్), భారతి ఫుల్మాలి, శ్రీ చరణి, రేణుకా సింగ్, క్రాంతి గౌడ్, అరుంధతి రెడ్డి, శ్రేయాంక పాటిల్, రాధా యాదవ్, నందిని శర్మ.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srinidhi Shetty | ఒక్కో సినిమాకు రూ.8 కోట్లు తీసుకుంటున్నానా .. ప్రచారాలపై శ్రీనిధి శెట్టి క్లారిటీ..!
Rajanna Sircilla | చెరువులో మునిగి యువకుడి మృతి.. తండ్రికి దూరమైన ముగ్గురు చిన్నారులు!
భువనగిరి అరోరా కాలేజీలో కలకలం.. విద్యార్థినుల ఫొటోలు, వీడియోలు లీక్.. వైరల్ అవుతున్న ఆడియో కాల్!
Donald Trump | నాకు 8 నోబెల్ శాంతి బహుమతులు రావాల్సింది.. డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసంతృప్తి..!
Earthquake | పనామాలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 7.6 తీవ్రత నమోదు..!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

