భువనేశ్వర్: ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్‌లో భారత అమ్మాయిల హాకీ జట్టు వైఫల్యాల పరంపర కొనసాగుతోంది. సోమవారం ఇక్కడి కళింగ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో భారత్.. 2-4తో నెదర్లాండ్స్ చేతిలో పరాభవం పాలైంది. ఉదిత (18ని, 42ని)లో రెండు పెనాల్టీ కార్నర్లను గోల్స్‌గా మలిచింది. ఈ టోర్నీలో ఆడిన ఏడు మ్యాచ్‌లలో మన అమ్మాయిలకు ఇది నాలుగో పరాజయం. ఇక అబ్బాయిల పోరులో ఇంగ్లండ్ 3-2తో భారత్‌ను ఓడించింది. 18వ నిమిషంలో అభిషేక్, 39వ నిమిషంలో సుఖ్జీత్ సింగ్ తలా ఓ గోల్ చేశారు. ఇంగ్లండ్ తరఫున జాకబ్ పేటన్ (15ని.) తొలి గోల్ చేయగా సామ్ వర్డ్ (19ని, 29ని.) రెండు గోల్స్ చేశాడు.