IND vs AUS | హాకీ టెస్ట్ నాలుగో మ్యాచ్లో భారత్ ఓటమి.. సిరీస్ ఆస్ట్రేలియా వశం
కీలకమైన నాలుగో హాకీ టెస్ట్ మ్యాచ్లో భారత్ పరాజయం పాలైంది
IND vs AUS : ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు మ్యాచ్ల హాకీ టెస్ట్ సిరీస్లో భారత్కు మరో ఓటమి ఎదురైంది. కీలకమైన నాలుగో హాకీ టెస్ట్ మ్యాచ్లో భారత్ పరాజయం పాలైంది. అడిలైడ్లో శనివారం జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా జట్టు 5-1తో గెలుపొందింది. మ్యాచ్ ప్రారంభమైన 25వ నిమిషంలోనే దిల్ప్రీత్సింగ్ మొదటి గోల్ చేసి భారత్కు శుభారంభం అందించాడు. అయితే, ఆ తర్వాత ఆస్ట్రేలియా డిఫెన్స్ ధాటిగా ఆడడంతో భారత ఆటగాళ్లకు గోల్ చేసే అవకాశం దొరకలేదు. ఆస్ట్రేలియా వరసగా 5 గోల్స్ సాధించి మ్యాచ్ సొంతం చేసుకుంది. దాంతో, టెస్ట్ సిరీస్లో 3-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
ఆస్ట్రేలియా ఆటగాళ్లు జెరెమి హవార్డ్ 29వ, 41వ నిమిషంలో గోల్స్ కొట్టాడు. జాక్ వెట్టన్ 30 నిమిషంలో, టామ్ వికమ్ 34వ నిమిషంలో గోల్ అందించారు. మాట్ డాసన్ 54వ నిమిషంలో ఐదో గోల్ సాధించాడు. మూడో టెస్ట్ మ్యాచ్లో భారత్ 4-3తో గెలిచి సిరీస్లో నిలిచింది. అయితే, కీలకమైన నాలుగో మ్యాచ్లో మాత్రం మెరుగైన ప్రదర్శన చేయలేకపోయింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

