MS Dhoni : భారత పురుషుల క్రికెట్లో మేరునగధీరురుడు మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni). రైల్వేలో టికెట్ కలెక్టర్ నుంచి టీమిండియా కెప్టెన్‌గా ఎదిగిన ధోనీ.. మరెవరీకి సాధ్యం కాని రికార్డులు నెలకొల్పాడు. కపిల్ దేవ్ (Kapil Dev)తర్వాత టీమిండియాకు వన్డే వరల్డ్ కప్ అందించిన రెండో సారథిగా చరిత్రకెక్కాడు ధోనీ. అంతేకాదు తొలి ఎడిషన్ పొట్టి ప్రపంచకప్‌ను భారత జట్టుకు అందించి ‘జయహో నాయకా’ అనిపించుకున్నాడీ ఝార్ఖండ్ డైనమైట్. హెలిక్యాప్టర్ షాట్ సిక్సర్లతో అలరించి.. ఐసీసీ ట్రోఫీల్లో మన జట్టు బలాన్ని చూపించిన తాలా.. ఈరోజు(జూలై 7)తో 45వ వసంతంలో అడుగుపెట్టాడు.
జార్ఘండ్ డైనమైట్‌గా మనందరికి సుపరిచితుడైన ధోనీ 1981లో జూలై 7వ తేదీన జన్మించాడు. 23 ఏళ్లకు జాతీయ జట్టులోకి వచ్చిన ధోనీ.. ఆటగాడిగా, సారథిగా తనముద్ర వేశాడు. ఐపీఎల్‌లోనూ చెన్నై సూపర్ కింగ్స్‌ను ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిపిన ఘనుడు మహీ భాయ్. హోటల్ మేనేజ్మెంట్ చేసిన సాక్షి సింగ్‌ను 2010 జూలై 4న పెళ్లాడిన ధోనీ.. మూడు రోజుల క్రితమే 16వ వివాహ వార్షికోత్సవం చేసుకున్నాడు. మంగళవారం జూలై 7వ తేదీతో ఈ దిగ్గజానికి 45 ఏళ్లు వచ్చాయి. దాంతో, బీసీసీఐ, మాజీ ఆటగాళ్లు, తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్‌లు ధోనీకి శుభాకాంక్షలు తెలియజేశారు. వయసు పైబడుతున్నా అభిమానుల్లో క్రేజ్ ఇసుమంతైనా తగ్గని ధోనీ కబుర్లివి.
5⃣3⃣8⃣ Intl Matches 🙌
1⃣7⃣,2⃣6⃣6⃣ Intl Runs 👌
8⃣2⃣9⃣ Intl Dismissals behind the stumps 👏Winning Captain of ICC Men’s T20 World Cup 2007, ICC Men’s ODI World Cup 2011, ICC Champions Trophy 2013 🏆🏆🏆
Happy Birthday to Former #TeamIndia Captain @msdhoni, an absolute icon of… pic.twitter.com/rsovep8gWI
— BCCI (@BCCI) July 7, 2026
చిన్నతనం నుంచి క్రికెట్‌ను ఇష్టపడిన ధోనీ.. పెద్దయ్యాక కూడా ఆటపై మమకారాన్ని వదులుకోలేదు. అయితే.. ఆర్ధిక భద్రత కోసం ప్రభుత్వ ఉద్యోగం చేయాలనుకున్నాడు. స్పోర్ట్స్ కోటాలో 2001లో రైల్వేలో ట్రావెల్లింగ్ టికెట్ ఎగ్జామినర్ (TTE)గా చేరిన మహీ భాయ్.. దక్షిణ తూర్పు రైల్వే(ఆగ్నేయ రైల్వే) జట్టుకు ఆడుతూ సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. జులపాల జుట్టుతో 2004లో బంగ్లాదేశ్‌పై వన్డే మ్యాచ్‌తో అరంగేట్రం చేసిన అతడు.. ఏడాది తర్వాత టెస్టు మ్యాచ్ ఆడాడు. సుదీర్ఘ ఫార్మాట్ కంటే వన్డేలతోనే పేరు తెచ్చుకున్న ధోనీ శ్రీలంకపై (183), పాకిస్థాన్‌పై (148) సెంచరీలతో విరుచుకుపడడాన్ని అభిమానులు ఇప్పటికీ మర్చిపోలేరు.
From every resounding whistle that echoes your name to the countless hearts you’ve inspired, your journey has become a cherished part of Tamil Nadu’s sporting emotion!
Happy Birthday to our ‘Captain Cool’ Mahendra Singh Dhoni! Your extraordinary cricketing legacy, calm… pic.twitter.com/lFdQsQn3ee
— CMOTamilNadu (@CMOTamilnadu) July 7, 2026
రాహుల్ ద్రవిడ్ నుంచి 2007లో టీ20 కెప్టెన్సీ చేపట్టిన ధోనీ.. అదే ఏడాది ఐసీసీ తొలిసారి ప్రవేశపెట్టిన టీ20 వరల్డ్‌కప్‌లో భారత జట్టును ఛాంపియన్‌గా నిలిపాడు. తన హయాంలో మొత్తంగా మూడు ఐసీసీ ట్రోఫీలు అందించాడు. 2011లో వన్డే ప్రపంచకప్, 2013లో ఛాంపియన్స్ ట్రోఫీలు సాధించిన మహీ.. 2019లో అనూహ్యంగా తన కెరీర్ ముగించాడు

ఇంగ్లండ్ ఆతిథ్యమిచ్చిన వన్డే వరల్డ్ కప్ సెమీ ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఓటమి తర్వాత ఈ క్షణంలో నా కెరీర్ ముగిసింది అని అభిమానులకు షాక్ ఇచ్చాడీ వెటరన్ ప్లేయర్. 1929 నుంచి నేను రిటైర్ అయినట్టుగా భావించండి అని ఒకే ఒక వ్యాఖ్యంలో ఆటకు వీడ్కోలు పలికాడీ దిగ్గజం.
కివీస్ నిర్దేశించిన లక్ష్య ఛేదనలో జట్టును గెలిపించేందుకు శాయశక్తులా పోరాడాడు ధోనీ. అర్ధ శతకం బాదిన అతడు రవీంద్ర జడేజాతో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. అయితే.. మార్టిన్ గఫ్తిల్ విసిరిన మెరుపు త్రోకు రనౌట్‌గా వెనుదిరిగాడు. అంతే టీమిండియా ఓటమి ఖాయమైంది. అయ్యో.. టీమ్‌ను ఫైనల్ చేర్చలేకపోయాననే బాధతో ఆ క్షణమే అంతర్జాతీయ క్రికెట్‌కు అల్విదా పలకాలని మనసులో డిసైడ్ అయ్యాడు మహీ భాయ్. ఈ విషయాన్ని 2020 ఆగస్టు 15న అధికారికంగా వెల్లడించాడు.

ఓవైపు వికెట్ కీపర్‌గా.. మరోవైపు విధ్వంసక ఆటగాడిగా, ఏడో స్థానంలో ఫినిషర్‌గా ఇలా ఎన్నో బాధ్యతల్ని సమర్ధంగా నిర్వర్తించాడు ధోనీ. తన హెలిక్యాప్టర్ షాట్లతో అభిమానులను అలరించిన ఈ స్టార్ ఆటగాడు వన్డేల్లో 10,773, టెస్టుల్లో 4,876, టీ20ల్లో1,617 పరుగులు సాధించాడు. ఐపీఎల్ రిటైర్మెంట్కూ దగ్గరైన ధోనీ19వ సీజన్లో బరిలోకి దిగలేదు. దాంతో, వచ్చే సీజన్లో అతడు సీఎస్కే కోచ్ లేదా మెంటర్ వంటి బాధ్యతలు చేపట్టే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.