సుఝౌ(చైనా) : సుదిర్మన్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీని ఇండియా విజయంతో ముగించింది. బుధవారం జరిగిన తమ చివరి గ్రూప్ మ్యాచ్‌లో ఇండియా 4-1 తేడాతో ఆస్ట్రేలియాపై గెలుపొందింది. ఇండియా తొలి పోరులో 1-4తో చైనీస్ తైపీ చేతిలో, రెండో మ్యాచ్‌లో 0-5తో మలేసియా చేతిలో ఓటమిపాలై టోర్నీనుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే.
బుధవారంనాటి పోరులో తొలుత మిక్స్డ్ డబుల్స్ జోడి సాయి ప్రతీక్-తనిషా క్రాస్టొ 21-17, 14-21, 18-21తో కెన్నెత ఝె హూయి చో-గ్రోన్య సొమర్విల్లె చేతిలో ఓడిపోగా, హెచ్ ప్రణయ్ 21-8, 21-8తో జాక్ యుపై గెలుపొంది స్కోరును సమం చేశాడు. అనంతరం మహిళల సింగిల్స్‌లో అనుపమ ఉపాధ్యాయ 21-16, 21-18తో టిఫాని హొపై, పురుషుల డబుల్స్‌లో అర్జున్-ధృవ కపిల 21-11, 21-12తో రికి టాంగ్-రైన్ వాంగ్‌పై, మహిళల డబుల్స్‌లో కాస్ట్రొ-అశ్విని పొన్నప్ప 21-19, 21-13తో కైట్లిన్ ఇయ-ఆంజెల యుపై గెలుపొంది టోర్నీలో ఇండియాకు ఓదార్పు విజయం అందించారు.