Paris Olympics 2024 | గర్జించిన హాకీ యోధులు.. భారత్‌కు నాలుగో కాంస్యం
Paris Olympics 2024 : ఒలింపిక్స్ కాంస్య పోరులో భారత హాకీ (Indian Hockey) యోధులు గర్జించారు. విశ్వ క్రీడల్లో దేశానికి నాలుగో కాంస్య పతకం (Bronze Medal) అందించారు. గురువారం స్పెయిన్ (Spain)తో హోరాహోరీగా సాగిన పోరులో టీమిండియా 2-1తో కంచుమోత మోగించింది.
Paris Olympics 2024 : ఒలింపిక్స్ కాంస్య పోరులో భారత హాకీ (Indian Hockey) యోధులు గర్జించారు. విశ్వ క్రీడల్లో దేశానికి నాలుగో కాంస్య పతకం (Bronze Medal) అందించారు. గురువారం స్పెయిన్ (Spain)తో హోరాహోరీగా సాగిన పోరులో టీమిండియా 2-1తో కంచుమోత మోగించింది. ఒకదశలో 1-0తో వెనకబడిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ (Hamanpreet Singh) వరుస గోల్స్‌తో ప్రత్యర్థికి భారత జట్టు దడపుట్టించింది. ఆఖర్లో స్పెయిన్ రెండు గోల్ ప్రయత్నాలను అడ్డుకొని టీమిండియా చిరస్మరణీయ విజయంతో కాంస్యాన్ని ముద్దాడింది. ఆఖరి ఒలింపిక్స్ ఆడుతున్న గోల్ కీపర్ పీఆర్ శ్రీజేష్(PR Sreejesh)కు ఘనమైన వీడ్కోలు పలికింది.
విశ్వ క్రీడల్లో ఆద్యంతం రఫ్పాడించిన భారత హాకీ జట్టు కాంస్యం మ్యాచ్‌లోనూ చెలరేగింది. ప్రత్యర్థి గోల్ ప్రయత్నాలను సమర్ధంగా అడ్డుకొని పకత గర్జనతో యావత్ దేశాన్ని సంబురాల్లో ముంచెత్తింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ గురి తప్పకుండా గోల్ కొట్టగా.. డిఫెన్స్ బృందం ప్రత్యర్థి ఆటగాళ్ల ఎత్తులను చిత్తు చేసింది. ఇక.. వాల్ శ్రీజేష్ ఎప్పటిలానే బంతిని అడ్డుకొని టీమిండియా విజయంలో భాగమయ్యాడు. సుదీర్ఘ కెరీర్‌ను ఒలింపిక్ విజేతగా ముగించాడు.
Our Hockey Heroes!🏑🇮🇳 pic.twitter.com/6mCbaiUeFK
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) August 8, 2024
పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా..
తొలి అర్ధ భాగంలో స్పెయిన్ ఆటగాడు మార్క్ మిరల్లెస్ పెనాల్టీ కార్నర్‌ను గోల్ పోస్ట్‌లోకి పంపి ఇండియాను ఒత్తిడిలోకి నెట్టాడు. అయితే.. కాసేపట్లో తొలి అర్ధ భాగం ముగుస్తుందనగా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచాడు. అంతే.. 1-1తో స్కోర్ సమం అయింది.
🇮🇳🥉 𝗕𝗥𝗜𝗟𝗟𝗜𝗔𝗡𝗧 𝗕𝗥𝗢𝗡𝗭𝗘! Many congratulations to the men’s hockey team on securing a second consecutive Olympic Bronze medal after previously winning it at 🇯🇵 Tokyo 2020.
🔥 The Indian men’s hockey team last won back-to-back Bronze medals in the 1968 and 1972… pic.twitter.com/Yl4gQpj7vI
— India at Paris 2024 Olympics (@sportwalkmedia) August 8, 2024
అనంతరం రెండో అర్ధభాగం మొదలవ్వగానే భారత సారథి మళ్లీ పెనాల్టీ కార్నర్‌ను స్పెయిన్ గోల్ కీపర్ కళ్లుగప్పి గోల్స్ కొట్టాడు. దాంతో, భారత జట్టు 2-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆ తర్వాత భారత డిఫెండర్లు స్పెయిన్ ఫార్వర్డ్స్‌ను సమర్ధంగా నిలువరించారు. మరికాసేపట్లో ఆట ముగుస్తుందనగా స్పెయిన్‌కు పెనాల్టీ కార్నర్ లభించింది. కానీ, భారత వాల్ శ్రీజేష్ అద్భుతంగా బంతిని అడ్డుకున్నాడు.
Bronze with a golden shine! 🥉
The Indian Men’s Hockey Team ends the Paris 2024 Olympics on a high, securing a bronze medal.
A moment of pride for every Indian! 🇮🇳 #IndianFootball⚽️ pic.twitter.com/ZbxELgm1E6
— Indian Football Team (@IndianFootball) August 8, 2024
పారిస్ ఒలింపిక్స్‌లో టీమిండియా అద్భుత విజయాలతో దూసుకెళ్లింది. ప్రీ క్వార్టర్ ఫైనల్లో ఆస్ట్రేలియాను 3-2తో చిత్తు చేసింది. 52 ఏండ్ల తర్వాత ఒలింపిక్స్‌లో ఆసీస్‌పై విక్టరీతో చరిత్ర సృష్టించింది. అనంతరం క్వార్టర్స్‌లో బ్రిటన్‌తో స్కోర్లు సమం కాగా పెనాల్టీ షూటౌట్లో 4-2తో మట్టికరిపించి సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. అయితే.. 44 ఏండ్ల తర్వాత స్వర్ణాన్ని ముద్దాడాలనుకున్న టీమిండియా కలకు జర్మనీ చెక్ పెట్టింది. టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక మ్యాచ్‌లో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. సెమీఫైనల్లో టీమిండియాను 3-2తో ఓడించింది. దాంతో, మళ్లీ హర్మన్‌ప్రీత్ బృందం బ్రాంజ్ మెడల్ మ్యాచ్ ఆడాల్సి వచ్చింది.
ఇవి కూడా చదవండి
- Vinod Kumar | ఎస్బీఐ ఛైర్మన్‌గా తెలంగాణ బిడ్డ ఎంపిక కావడం హర్షణీయం : వినోద్ కుమార్
- Pushkar Singh Dhami | వక్ఫ్ బిల్లుతో ఆక్రమణలకు చెక్ : పుష్కర్ సింగ్ ధామి
- CDS Anil Chauhan | ప్రపంచ భద్రతా వాతావరణం మారిపోయింది : సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

