Team India | ఆసియా కప్‌లో వరుసగా రెండో విజయం.. సెమీస్‌కు భారత్!
మహిళల ఆసియా కప్‌లో డిఫెండింగ్ చాంపియన్ భారత్ వరుసగా రెండో విజయం సాధించింది.
- యూఏఈపై ఘనవిజయం
Team India | దంబుల్లా (శ్రీలంక): మహిళల ఆసియా కప్‌లో డిఫెండింగ్ చాంపియన్ భారత్ వరుసగా రెండో విజయం సాధించింది. తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించిన మన అమ్మాయిలు.. ఆదివారం యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)తో జరిగిన మ్యాచ్‌లోనూ 78 పరుగుల భారీ తేడాతో గెలిచి సెమీస్ బెర్తు ఖాయం చేసుకున్నారు. మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 201 పరుగుల రికార్డు స్కోరు చేసింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (47 బంతుల్లో 66, 7 ఫోర్లు, 1 సిక్స్), యువ వికెట్ కీపర్ రిచా ఘోష్ (29 బంతుల్లో 64 నాటౌట్, 12 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడటంతో ఈ ఫార్మాట్లో భారత్ 200 పరుగుల మార్కును తొలిసారిగా దాటింది.
తన టీ20 కెరీర్లో తొలి అర్ధ శతకం సాధించిన రిచా బౌండరీలతో విరుచుకుపడింది. 26 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తిచేసిన ఆమె ఈ మ్యాచ్‌లో 64 పరుగులు చేస్తే అందులో 54 పరుగులు ఫోర్లు, సిక్స్ రూపంలో వచ్చినవే.ఈ ఇన్నింగ్స్‌తో రిచా మహిళల ఆసియా కప్‌లో అర్ధ శతకం సాధించిన తొలి భారత వికెట్ కీపర్‌గా రికార్డులకెక్కింది. అనంతరం ఛేదనలో యూఏఈ 20 ఓవర్లకు 7 వికెట్లు కోల్పోయి 123 పరుగులే చేయగలిగింది. ఆ జట్టులో కవిషా (32 బంతుల్లో 40, 3 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్. కెప్టెన్ రోహిత్ ఒజా (38) రాణించింది. దీప్తి శర్మ (2/23) రాణించగా రేణుకా, తనూజా, రాధా యాదవ్ తలా ఓ వికెట్ తీశారు. ఇక ఈ టోర్నీలో భారత్ తమ తదుపరి మ్యాచ్‌ను మంగళవారం నేపాల్‌తో ఆడనుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KAAKA | వాయిదా వార్తలకు చెక్: జనవరి 13న ‘కాకా’ విధ్వంసం ఖాయం.. చిరంజీవి అధికారిక ప్రకటన!
HIT 4 | హిట్ 4పై కీలక అప్డేట్.. స్క్రిప్ట్ పూర్తి చేసిన శైలేష్ కొలను, కార్తీకి కథ ఎప్పుడు వినిపించనున్నారంటే?
Bigg Boss 10 | బిగ్ బాస్ 10లో డబుల్ ఎలిమినేషన్.. టెంపర్ వంశీ అవుట్, వర్షిణి కూడా ఇంటిబాట పట్టిందా?
Koratala Siva | బాలయ్య – కొరటాల శివ సినిమాలో హీరోయిన్గా సంయుక్త మీనన్.. జనవరి నుంచి ఫస్ట్ షెడ్యూల్!
Puducherry | పుదుచ్చేరి సముద్రంలో కొట్టుకుపోయిన తెలంగాణ విద్యార్థులు.. ఆరుగురు సురక్షితం.. ఒకరు గల్లంతు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

