టీమిండియా కొత్త సారధి రోహిత్ రివ్యూలతో వికెట్లు తీస్తున్నాడు. వినడానికి తమాషాగా ఉన్నప్పటికీ ఇది నిజమే. విండీస్‌తో జరుగుతున్న తొలి వన్డేలో స్పిన్నర్లు బౌలింగ్ చేస్తుంటే.. వికెట్లు మాత్రం రోహిత్ తీసేస్తున్నాడు. అదెలాగంటే.. ఈ మ్యాచ్‌లో భారత స్పిన్నర్లు వాషింగ్టన్ సుందర్, చాహల్ ఇద్దరు విండీస్ బ్యాటర్లను ఎల్బీ అవుట్ చేశారు.
ఈ రెండు సార్లూ అంపైర్లు అవుట్ ఇవ్వలేదు. కానీ రోహిత్ రివ్యూ కోరి, విండీస్ బ్యాటర్లను పెవిలియన్ చేర్చాడు. ఇప్పుడు మరోసారి చాహల్ బౌలింగ్‌లో బ్రూక్స్ (10) డిఫెన్స్ ఆడాడు. అయితే ఆ బంతి బ్యాటు పక్క నుంచి వెళ్లి పంత్ చేతుల్లో పడింది. చాహల్, పంత్ అప్పీలు చేశారు. కానీ అంపైర్ అవుటివ్వలేదు. అంతే వాళ్లంతా రోహిత్ వైపు చూశారు.
అతను పంత్, చాహల్‌తో ఒకసారి మాట్లాడి రివ్యూ కోరాడు. రిప్లేలో బంతి.. బ్యాటును చాలా చిన్నగా టచ్ చేసి వెళ్లినట్లు తేలింది. దీంతో చాహల్ ఖాతాలో మరో వికెట్ పడింది. బ్రూక్స్ పెవిలియన్ చేరాడు. అయితే ఈ వికెట్ క్రెడిట్ కూడా రోహిత్‌దే అంటూ సోషల్ మీడియాలో కొందరు కామెంట్లు చేస్తున్నారు.
#INDvsWI pic.twitter.com/chLe3s90ny
— Ayush (@Wahhyush) February 6, 2022