IND vs SL : బ్యాంటిగ్‌కు అచ్చొచ్చిన గువాహటి పిచ్‌పై భారత ఓపెనర్లు అదరగొడుతున్నారు. యంగ్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ కూడా హాఫ్ సెంచరీ (56) కొట్టాడు. దసున్ షనక బౌలింగ్‌లో సింగిల్ తీసి 50 పరుగుల మార్క్ అందుకున్నాడు. అతని ఇన్నింగ్స్‌లో అందులో 7 ఫోర్లు ఉన్నాయి. ఈ యంగ్‌స్టర్‌కు ఇది వన్డేల్లో 5వ హాఫ్ సెంచరీ. టీ20 సిరీస్‌లో విఫలమైన అతను తొలి వన్డేలో రాణించాడు. జట్టు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాడు. మరోవైపు కెప్టెన్ రోహిత్ శర్మ దూకుడుగా ఆడుతున్నాడు. 41 బంతుల్లోనే 51 రన్స్ చేసిన అతను వేగం పెంచాడు. 57బంతుల్లోనే 7 ఫోర్లు మూడు సిక్సర్లతో 71 రన్స్ చేశాడు. వీళ్లిద్దరూ 20 ఓవర్లకు141 పరుగుల భాగస్వామ్యం నిర్మించారు. దాంతో, టీమిండియా భారీ స్కోర్ దిశగా పయనిస్తోంది.
టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ షనక ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. భారత ఆటగాళ్లు ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ బెంచ్‌కే పరిమితం అయ్యారు. ఓపెనర్‌గా శుభ్‌మన్ గిల్, మిడిలార్డర్లో శ్రేయాస్ అయ్యర్‌ను తుది జట్టులోకి తీసుకున్నారు. ఈ వన్డేలో గెలిచి సిరీస్‌లో ఆధిక్యంలోకి వెళ్లాలని భారత్ భావిస్తోంది.