IND vs SL | తొలి వన్డేలో టీమిండియా విజయం.. 67 పరుగుల తేడాతో లంక చిత్తు
మూడు వన్డేల సిరీస్‌లో ఆధిక్యంలో టీమిండియా
IND vs SL : తొలి వన్డేలో భారత్ శ్రీలంకపై భారీ విజయం సాధించింది. 67 పరుగులతో లంకను చిత్తు చేసింది. మూడు వన్డేల సిరీస్‌లో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. నిర్ణీత ఓవరల్లో లంక 8 వికెట్ల నష్టానికి 306 రన్స్ చేసింది. కింగ్ కోహ్లీ కళాత్మక షాట్లతో 45వ వన్డే సెంచరీకి తోడు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ అర్థసెంచరీ చేయడంతో తొలి వన్డేలో భారత్ భారీ స్కోర్ చేసింది. శ్రీలంకకు 374 పరుగుల టార్గెట్ నిర్ధేశించింది. కొండంత లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో శ్రీలంక వరుసగా వికెట్లు కోల్పోయింది. చివర్లో కెప్టెన్ దసున్ షనక తుఫాన్ ఇన్నింగ్స్ ఆడి సెంచరీ (108) బాదాడు. షనక ఇచ్చిన రెండు క్యాచ్‌లు రోహిత్ శర్మ, కోహ్లీ క్యాచ్‌లు జారవిడిచారు. దాంతో లంక పరుగులు 300 పరుగులు చేయగలిగింది.
లంక టాపార్డర్‌లో ఓపెనర్ ప్రథుమ్ నిస్సంకా (72), ధనంజయ డిసిల్వా(47), చరిత అసలంక (23) రాణించారు. భారత బౌలర్లు వరుసగా వికెట్లు తీస్తూ లంకను ఒత్తిడిలోకి నెట్టారు. ఆవిష్క ఫెర్నాండో(5), కుశాల్ మెండిస్(0)లను అవుట్ చేసి సిరాజ్ లంకను దెబ్బతీశాడు. భారత బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్ మూడు, సిరాజ్ రెండు వికెట్లు పడగొట్టారు. చాహల్, షమి, హార్ధిక్ పాండ్యాకు ఒక్కో వికెట్ దక్కింది.
శతక్కొట్టిన కోహ్లీ
ఓపెనర్లు రోహిత్, గిల్ మొదటి వికెట్‌కు 143 పరుగులు జోడించారు. శ్రేయాస్ అయ్యర్ (28), కేఎల్ రాహుల్ (39)లతో కలిసి కోహ్లీ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. మునపటి కోహ్లీని గుర్తు చేస్తూ తనదైన షాట్లతో లంక బౌలర్లను చెండాడాడు. 80 బంతుల్లోనే సెంచరీ బాదాడు. శ్రీలంకపై కోహ్లీకి ఇది 9వ సెంచరీ. స్వదేశంలో 20వ శతకం. ధాటిగా ఆడే క్రమంలో హార్ధిక్ పాండ్యా (14), అక్షర్ పటేల్ (9)త్వరగా వెనుదిరిగారు. లంక బౌలర్లలో రజిత మూడు వికెట్లు పడగొట్టాడు. మధుషనక, దసున్ షనక తలా ఒక వికెట్ తీశారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

