IND vs SL : టీమిండియా యంగ్ పేసర్ ఉమ్రాన్ మాలిక్ తొలి వికెట్ సాధించాడు. ధాటిగా ఆడుతున్న వనిందు హసరంగను అవుట్ చేశాడు. హసరంగ ఇచ్చిన క్యాచ్‌ను స్లిప్‌లో అక్షర్ పటేల్ అందుకున్నాడు. హసరంగ 17 బంతుల్లో 21 రన్స్ చేశాడు. అంతకుముందు చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ విజృభించడంతో శ్రీలంక కష్టాల్లో పడింది. చరిత అసలకం కుల్దీప్ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి ఆరో వికెట్‌గా వెనుదిరిగాడు. అంతకు ముందు ఓవర్లో కెప్టెన్ దసున్ షనక(4)ను కుల్దీప్ యాదవ్ బౌల్డ్ చేశాడు. హాఫ్ సెంచరీ చేసి ఫామ్‌లో ఉన్న ఓపెనర్ నవనిదు ఫెర్నాండో నాలుగో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. కుశాల్ మెండిస్‌ను బౌల్డ్ చేసిన కుల్దీప్ భారత్‌కు రెండో వికెట్ అందించాడు. ప్రస్తుతం దునిత్ వెల్లలాగే, చమిక కరుణరత్నే క్రీజులో ఉన్నారు. 28 ఓవర్లు పూర్తయ్యే సరికి శ్రీలంక 152 రన్స్ చేసింది.