దుబాయ్: పసికూన స్కాట్లాండ్పై భారత బౌలర్లు విజృంభిస్తున్నారు. బుమ్రా, షమీ ఇప్పటికే చెరో వికెట్ తీసుకుని సత్తా చాటారు. ఆ వెంటనే రవీంద్ర జడేజా మరో రెండు వికెట్లు కూల్చాడు. ఏడో ఓవర్లో బంతి అందుకున్న జడ్డూ.. మూడో బంతికే రిచీ బెర్రింగ్టన్ (0)ను క్లీన్‌బౌల్డ్ చేశాడు.
అదే ఓవర్ చివరి బంతికి మెక్లాయిడ్ (2)ను కూడా ఎల్బీగా పెవిలియన్ పంపాడు. దీంతో స్కాట్లాండ్ జట్టు 29/4తో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది.