దుబాయ్: టీమిండియా ఓపెనర్లకు పూనకం వచ్చిందేమో? పసికూన స్కాట్లాండ్పై దుమ్ముదులిపేస్తున్నారు. వీరి ధాటికి జట్టు స్కోరు నాలుగు ఓవర్లకే 50 పరుగులు దాటేసింది. తొలుత బౌలర్లు విజృంభించడంతో స్కాట్లాండ్ను 85 పరుగులకే ఆలౌట్ చేసిన భారత్‌కు రాహుల్ (26 నాటౌట్), రోహిత్ (26 నాటౌట్) అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు.
వీరికి ఎలాంటి బంతులేయాలో తెలియక స్కాట్లాండ్ బౌలర్లు తికమక పడాల్సిన పరిస్థితి. వీరిద్దరూ బౌండరీలతో విరుచుకుపడటంతో నాలుగు ఓవర్లు ముగిసే సరికి భారత జట్టు వికెట్లేమీ నష్టపోకుండా 53 పరుగులు చేసింది. ఇదంతా చూస్తుంటే పవర్‌ప్లే ముగిసే సరికి భారత్ ఈ మ్యాచ్ గెలిచేలా కనబడుతోంది.