దుబాయ్: పసికూన స్కాట్లాండ్పై భారత బౌలర్లు ప్రతాపం చూపారు. నిప్పులు చెరిగే బంతులతో స్కాట్లాండ్ బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తించారు. ఆరంభంలోనే ఆ జట్టులో ఓపెనర్ జార్జ్ మున్సే (24)ను అవుట్ చేసిన పేసర్ మహమ్మద్ షమీ 17వ ఓవర్లో విశ్వరూపమే చూపాడు.
తొలి బంతికి కాలమ్ మెక్లాయిడ్ (16)ను బౌల్డ్ చేశాడు. ఆ తర్వాతి బంతికే సఫ్యాన్ షరీఫ్ (0) రనౌటయ్యాడు. మూడో బంతికి అద్భుతమైన డెలివరీతో అలస్దైర్ ఇవాన్స్ (0)ను పెవిలియన్ చేర్చాడు. ఆ ఓవర్ ముగిసే సరికి 83/9తో ఉన్న స్కాట్లాండ్ కథను ఆ తర్వాతి ఓవర్లో బుమ్రా ముగించాడు.
బాణం వంటి యార్కర్‌తో మార్క్ వాట్ (14)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో 17.4 ఓవర్లలో 85 పరుగులకు స్కాట్లాండ్ ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో షమీ, జడేజా చెరో మూడు వికెట్లు తీసుకున్నారు. బుమ్రా రెండు వికెట్లు పడగొట్టగా, అశ్విన్ ఒక వికెట్ కూల్చాడు.