తొలి ఇన్నింగ్స్‌లో పుజారాను గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేర్చిన సఫారీ పేసర్ లుంగి ఎన్గిడీకే.. రెండో ఇన్నింగ్సులో కూడా పుజారా వికెట్ దక్కింది. లంచ్ తర్వాత తొలి బంతికే కోహ్లీ అవుటవగా.. పుజారా నెమ్మదిగా ఆడుతూ నియంత్రణలో కనిపించాడు.
అయితే ఎన్గిడీ వేసిన ఫుల్‌లెంగ్త్ బంతిని ఫ్లిక్ చేయడానికి ప్రయత్నించగా.. అది ఎడ్జ్ తీసుకొని కీపర్ దిశగా వెళ్లింది. సౌతాఫ్రికా కీపర్ డీకాక్ దాన్ని అందుకోవడంతో పుజారా ఇన్నింగ్స్ ముగిసింది. ఈ ఇన్నింగ్సులో 64 బంతులాడిన పుజారా 16 పరుగులు మాత్రమే చేసి వెనుతిరిగాడు.
కాగా, కోహ్లీ అవుటవడంతో క్రీజులోకి వచ్చిన రహానే ఎదురుదాడికి దిగాడు. వచ్చీరాగానే బౌండరీలతో చెలరేగాడు. జేమీసన్ వేసిన ఓవర్లో వరుసగా 4, 6, 4 బాదాడు. పుజారా అవుటవడంతో రహానేకు పంత్ జతకలిశాడు.