IND vs SA | సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్‌కు తొలి ఎదురుదెబ్బ తగిలింది. రోహిత్ శర్మ గైర్హాజరీలో జట్టుకు ఓపెనింగ్ అందించే బాధ్యత కేఎల్ రాహుల్ (47 నాటౌట్), మయాంక్ అగర్వాల్ (60)లపై పడింది. వీళ్లిద్దరూ కూడా జట్టుకు నిలకడైన ఆరంభం అందించారు.
ఈ క్రమంలోనే అర్ధశతకం పూర్తి చేసుకున్న మయాంక్.. ఆ తర్వాత ఎన్గిడీ బౌలింగ్‌లో ఎల్బీగా పెవిలియన్ చేరాడు. రాహుల్, అగర్వాల్ నిలకడగా ఆడుతూ 117 భాగస్వామ్యం నెలకొల్పారు. ఎన్గిడీ వేసిన బంతి అగర్వాల్ ప్యాడ్లను తాకినా అంపైర్ అవుట్ ఇవ్వలేదు. దీంతో సౌతాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గార్ రివ్యూ కోరాడు. రివ్యూలో బంతి.. అగర్వాల్ బ్యాటుకు తాకలేదని స్పష్టమైంది.
బాల్ ట్రాకింగ్‌లో కూడా బంతి వికెట్లను తాకుతున్నట్లు తేలడంతో మయాంక్.. పెవిలియన్ బాటపట్టాడు. ఆ వెంటనే క్రీజులోని వచ్చిన ఛటేశ్వర్ పుజారా (0) మరోసారి తీవ్రంగా నిరాశపరిచాడు. ముందుకొచ్చి డిఫెన్స్ ఆడేందుకు పుజారా ప్రయత్నించాడు. దీంతో ఇన్సైడ్ ఎడ్జ్ తీసుకున్న బంతి.. అతని ప్యాడ్లను తాకి షార్ట్ లెగ్‌లో కీగన్ పీటర్సన్ అందుకున్న అద్భుతమైన క్యాచ్‌కు వెనుతిరిగాడు.