IND vs NZ : భారత ఓపెనర్ రోహిత్ శర్మ (34) అవుట్ అయ్యాడు. దాంతో 60 పరుగుల వద్ద ఇండియా తొలి వికెట్ కోల్పోయింది. నిలకడగా ఆడిన రోహిత్ 34 పరుగులకు వెనుదిరిగాడు. టిక్నర్ వేసిన 13 ఓవర్లో మిచెల్ క్యాచ్ పట్టడంతో అతని ఇన్నింగ్స్ ముగిసింది. శుభ్‌మన్ గిల్ (41), విరాట్ కోహ్లీ (8) నిలకడగా ఆడుతున్నారు. మొదటి వికెట్‌కు రోహిత్‌తో కలిసి గిల్ 60 రన్స్ జోడించాడు. 14 ఓవర్లు ముగిసే సరికి భారత్ స్కోర్ 88.