అరంగేట్ర మ్యాచ్‌లోనే పేసర్ హర్షల్ పటేల్ సత్తా చాటాడు. ప్రమాదకరంగా మారిన డారియల్ మిచెల్ (31)ను పెవిలియన్ చేర్చిన హర్షల్. 17వ ఓవర్లో మరోసారి మెరిశాడు. ప్రమాదకరంగా మారుతున్న గ్లెన్ ఫిలిప్స్ (34)ను అవుట్ చేశాడు.
పటేల్ వేసిన బంతిని సరిగా అంచనా వేయలేకపోయిన ఫిలిప్స్.. సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ రుతురాజ్ గైక్వాడ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. దీంతో 137 పరుగుల వద్ద కివీస్ జట్టు ఐదో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం జేమ్స్ నీషమ్, మిచెల్ శాంట్నర్ క్రీజులో ఉన్నారు.