న్యూజిల్యాండ్ సిరీస్‌లో భాగంగా జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో కివీస్ జట్టుకు తొలి ఓవర్లోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో జట్టును విజయతీరాలకు చేర్చిన డారియల్ మిచెల్‌ను ఇన్నింగ్స్ మూడో బంతికే పెవిలియన్ చేర్చిన భువనేశ్వర్ కుమార్.. టీమిండియాకు శుభారంభం అందించాడు.
ఫామ్‌లో లేని భువీని తుదిజట్టులోకి తీసుకోవడం పట్ల కొన్ని అనుమానాలు వ్యక్తమైనప్పటికీ తొలి ఓవర్లోనే కీలకమైన వికెట్ తీసిన భువీ తనలో సత్తా తగ్గలేదని నిరూపించాడు. అతని బౌలింగ్‌లో తొలి బంతికే మిచెల్ (0) గోల్డెన్ డక్‌గా అవుటయ్యాడు. టీ20 ప్రపంచకప్‌లో భారత్‌పై కూడా మిచెల్ అద్భుతంగా ఆడాడు. ఆ మ్యాచ్‌లో టార్గెట్ ఛేజ్ చేయడంలో కివీస్‌ను అతనే ముందుండి నడిపించిన సంగతి తెలిసిందే.