IND Vs ENG T20 | సిరీస్‌పై టీమిండియా కన్ను..! రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లాండ్‌తో మూడో టీ20 మ్యాచ్
IND Vs ENG T20 | సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమిండియా వరుస విజయాలతో జోరుమీదున్నది. ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌లో ఇప్పటికే కోల్‌కతా, చెన్నైలో జరిగిన మ్యాచుల్లో ఘన విజయం సాధించింది.
IND Vs ENG T20 | సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమిండియా వరుస విజయాలతో జోరుమీదున్నది. ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌లో ఇప్పటికే కోల్‌కతా, చెన్నైలో జరిగిన మ్యాచుల్లో ఘన విజయం సాధించింది. ఇక ప్రస్తుతం మూడో టీ20పై భారత్ దృష్టి సారించింది. ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించి.. సిరీస్‌ను కైవసం చేసుకోవాలనే కృతనిశ్చయంతో ఉన్నది. మరో వైపు ఇంగ్లాండ్ జట్టు మూడో టీ20లోనైనా బోణీ కొట్టాలని చూస్తున్నది. ఈ రెండు మ్యాచుల్లో బౌలింగ్‌లో భారత్ ఆకట్టుకుంది. ఇంగ్లాండ్ బ్యాటర్స్ భారీ స్కోర్ చేయకుండా కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి పరుగులు చేయకుండా నిరోధించగలిగింది.
అయితే, టీమిండియాకు కెప్టెన్ సూర్యకుమార్ ఫామ్ ఆందోళనకరంగా మారింది. గతేడాది సూర్యకుమార్ టీమిండియా టీ20 జట్టు కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించిన సమయంలో బ్యాటింగ్‌తో అలరించాడు. కానీ, కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించాక పరుగులు తీయడంలో ఇబ్బందిపడుతున్నాడు. టీ20ల్లో అత్యుత్తమ బ్యాటర్స్‌లో ఒకడైన సూర్యకుమార్.. 17 ఇన్నింగ్స్‌లో 26.18 సగటుతో 429 పరుగులు చేశాడు. పేలవమైన ఫామ్ కారణంగా సూర్యకుమార్ చాంపియన్స్ ట్రోఫీలో చోటు దక్కించుకోలేకపోయాడు. ఇంగ్లాండ్‌తో ప్రస్తుత టీ20 సిరీస్‌లోని తొలి రెండు మ్యాచుల్లోనూ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. రాబోయే మ్యాచుల్లోనైనా బ్యాట్‌తో రాణించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇక మూడో టీ20 జనవరి 28న రాజ్‌కోట్‌లోని నిరంజన్ షా మైదానంలో జరుగనున్నది. ఇంగ్లాండ్‌తో భారత్ తొలి మ్యాచ్ ఆడుతున్నది. ఇంతకు ముందు రాజ్‌కోట్‌లో టీమిండియా ఐదు టీ20లు ఆడగా.. అందులో నాలుగింట్లో గెలిచి.. ఇక మ్యాచ్‌లో ఓడిపోయింది.
ఈ మైదానంలో ఈ ఫార్మాట్లో ఇప్పటి వరకు ఇంగ్లాండ్‌తో ఆడలేదు. ఇరుజట్లు టీ20 మ్యాచ్‌లో ఆడుతుండడం ఇదే తొలిసారి. దాంతో మ్యాచ్‌లో పరుగుల వరద పారే అవకాశం ఉందని అంచనా. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన జట్టుకే విజయ అవకాశాలు ఉండగా.. టాస్ కీలకం కాబోతున్నది. మ్యాచ్ భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7 గంటలకు మొదలవుతుంది. అంతకన్నా ముందు సాయంత్రం 6.30 గంటలకు టాస్ జరుగుతుంది. రాజ్‌కోట్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండనున్నది. ఈ మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్ ప్రత్యక్ష ప్రసారం చేయనున్నది. డిస్నీ హాట్‌స్టార్ యాప్ (డిస్నీ ప్లస్ హోస్టార్)లో ఆన్లైన్లో చూడొచ్చు.
భారత జట్టు (అంచనా) : సంజు శాంసన్, (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రమణ్‌దీప్ సింగ్, అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి.
ఇంగ్లాండ్ జట్టు (అంచనా) : బెన్ డకెట్, ఫిల్ సాల్ట్ (వికెట్ కీపర్), జోస్ బట్లర్ (కెప్టెన్), హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టోన్, జామీ స్మిత్, జామీ ఓవర్టన్, బ్రైడాన్ కార్స్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్.
Read Also :
Jasprit Bumrah: బుమ్రాకు టెస్టు క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు
Smriti Mandhana: స్మృతి మందానాకు ఐసీసీ వన్డే మహిళా క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

