IND vs AUS : బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో ఢిల్లీ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు రసవత్తరంగా సాగుతోంది. రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా వికెట్ నష్టానికి 61 పరుగులు చేసింది. దాంతో, ఆ జట్టు 62 పరుగుల ఆధిక్యంలో ఉంది. రెండో రోజు ఆట ముగిసే సరికి ట్రావిస్ హెడ్ (39), మార్నస్ లబుషేన్ (16) క్రీజులో ఉన్నారు. 23 పరుగుల వద్ద ఆస్ట్రేలియా తొలి వికెట్ కోల్పోయింది. ఫామ్‌లో ఉన్న అతడిని ఔట్ చేసి జడ్డూ భారత్‌కు బ్రేక్ ఇచ్చాడు.
రెండో రోజు చెలరేగిన ఆసీస్ స్పిన్నర్లు చెలరేగడంతో టీమిండియా 262 పరుగులకే ఆలౌట్ అయింది. ప్రధాన స్పిన్నర్ లయాన్ ఐదు వికెట్లు పడగొట్టి భారత్‌ను దెబ్బతీశాడు. టాపార్డర్ బ్యాటర్లు కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, ఛతేశ్వర్ పూజారా, శ్రేయాస్ అయ్యర్‌లను ఔట్ చేసి లయాన్ ఆసీస్‌ను పోటీలో నిలిపాడు. వికెట్ కీపర్ శ్రీకర్ భరత్‌ను ఔట్ చేసి అతను ఐదు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు.
ఓవర్‌నైట్ స్కోర్ 21తో రెండో రోజు ఆట కొనసాగించిన భారత్ లయాన్ దెబ్బకు విలవిలలాడింది. 46 పరుగుల వద్ద నాథన్ లయాన్ ఓవర్లో ఓపెనర్ రాహుల్ (17)వికెట్ కోల్పోయింది. రోహిత్ శర్మ (32), పూజారా(0), శ్రేయాస్ అయ్యర్ (4)లను లయాన్ వెంట వెంటనే ఔట్ చేసి ఇండియాను ఒత్తిడిలోకి నెట్టాడు. అయితే.. విరాట్ కోహ్లీ (44), జడేజా (26) ఐదో వికెట్‌కు ఫిఫ్టీ పార్ట్నర్షిప్తో ఆదుకున్నారు. జడ్డూని ఎల్బీగా ఔట్ చేసిన మర్ఫీ ఆసీస్‌కు బ్రేక్ ఇచ్చాడు. కుహ్నేమాన్ ఓవర్లో కోహ్లీ ఎల్బీగా ఔట్ కావడంతో ఇండియా ఆరో వికెట్ కోల్పోయింది. దాంతో, ఇండియా ఒక దశలో 200 లోపే ఆలౌట్ అయ్యేలా కనిపించిది.
అక్షర్ పటేల్ కీలక ఇన్నింగ్స్ (74)తో జట్టును ఆదుకున్నాడు. ఆసీస్ స్పిన్నర్లపై ఎదురు దాడికి దిగిన అతను వరుసగా రెండో అర్థ శతకం సాధించాడు. అక్షర్, అశ్విన్ (37) జోడీ స్కోర్‌బోర్డును 250 దాటించింది. వీళ్లిద్దరూ ఆసీస్ స్పిన్ త్రయాన్ని సమర్ధంగా ఎదుర్కొంటూ పరుగులు సాధించారు. ఎనిమిదో వికెట్‌కు వీళ్లిద్దరూ 114 రన్స్ జోడించాడు. అయితే.. కొత్త బంతి తీసుకున్న ఆసీస్ రవిచంద్రన్ ఆశ్విన్, అక్షర్ పటేల్‌ను వెంట వెంటనే ఔట్ చేసింది. కుహ్నేమాన్, షమీని బౌల్డ్ చేయడంతో 262 రన్స్ వద్ద భారత ఇన్నింగ్స్ ముగిసింది. దాంతో, పర్యాటక ఆస్ట్రేలియాకు ఒక పరుగు ఆధిక్యం లభిచింది. ఆసీస్ బౌలర్లలో లయాన్ ఐదు వికెట్లు తీశాడు, కుహ్నేమాన్, మర్ఫీ తలా రెండు వికెట్లు పడగొట్టారు. కమిన్స్‌కు ఒక వికెట్ దక్కింది.
ఈ టెస్టులో నాథన్ లయాన్ మరో రికార్డుకు చేరువయ్యాడు. దాంతో బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో అత్యధిక సార్లు 5 వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా లయాన్ రికార్డు సాధించాడు. భారత లెజెండ్ అనిల్ కుంబ్లే 10 సార్లు ఐదు వికెట్లు తీసి అగ్రస్థానంలో ఉన్నాడు. మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ (7సార్లు) మూడో స్థానంలో నిలిచాడు.