భారత్‌తో జరుగుతున్న వార్మప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు ధాటిగా ఆడుతోంది. ఓపెనర్‌గా వచ్చిన మిచెల్ మార్ష్ (18 బంతుల్లో 35) అదరగొట్టాడు. అతనితోపాటు కెప్టెన్ ఆరోన్ ఫించ్ (41 నాటౌట్) కూడా అద్భుతంగా రాణించాడు. ఆ తర్వాత వచ్చిన స్టీవెన్ స్మిత్ (11) కూడా చక్కగా ఆడాడు. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ తన రెండో ఓవర్లో మార్ష్‌ను క్లీన్ బౌల్డ్ చేసి భారత్‌కు బ్రేకిచ్చాడు.
అనంతరం 11వ ఓవర్ వేసిన యుజ్వేంద్ర చాహల్.. తన తొలి ఓవర్లోనే స్టీవెన్ స్మిత్ (11)ను పెవిలియన్ చేర్చాడు. చాహల్ వేసిన బంతిని ఆడేందుకు రూం తీసుకున్న స్మిత్ షాట్ ఆడటంలో ఫెయిలయ్యాడు. దీంతో బంతి వికెట్లను కూల్చింది. దీంతో ఆ జట్టు 12 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి 102 పరుగులతో నిలిచింది.