Home
Sports
In The National Prestigious Tournament Ranji Trophy Hyderabad Has Suffered Its Fifth Defeat
హైదరాబాద్ ఐదోసారి
దేశవాళీ ప్రతిష్ఠాత్మక టోర్నీ రంజీ ట్రోఫీలో.. హైదరాబాద్ ఐదో పరాజయం మూటగట్టుకుంది. మహారాష్ట్రతో పోరులో హైదరాబాద్ 9 వికెట్ల తేడాతో ఓడింది. ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 385 పరుగులు చేయగా.. 176/5తో గురువారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన హైదరాబాద్.. 192 పరుగులకు ఆలౌటైంది.
- మహారాష్ట్ర చేతిలో ఘోర ఓటమి
పుణె: దేశవాళీ ప్రతిష్ఠాత్మక టోర్నీ రంజీ ట్రోఫీలో.. హైదరాబాద్ ఐదో పరాజయం మూటగట్టుకుంది. మహారాష్ట్రతో పోరులో హైదరాబాద్ 9 వికెట్ల తేడాతో ఓడింది. ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 385 పరుగులు చేయగా.. 176/5తో గురువారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన హైదరాబాద్.. 192 పరుగులకు ఆలౌటైంది. రోహిత్ రాయుడు (68), రాహుల్ (55) రాణించారు.
అనంతరం ఫాలోఆన్ ఆడిన హైదరాబాద్ రెండో ఇన్నింగ్స్‌లో 219 పరుగులు చేసింది. చందన్ సహాని (59), తన్మయ్ అగర్వాల్ (43) కాస్త పోరాడారు. 27 పరుగుల స్వల్ప విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన మహారాష్ట్ర ఒక వికెట్ కోల్పోయి 30 రన్స్ చేసింది. గ్రూపు-బిలో ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఐదు ఓటములు ఎదుర్కొన్న హైదరాబాద్ ప్రస్తుతం ఒక పాయింట్‌తో ఆఖర్లో(8) కొనసాగుతున్నది. తమ చివరి మ్యాచ్‌లో ఈనెల 24 నుంచి ఢిల్లీతో హైదరాబాద్ తలపడుతుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

