సోమవారం 06 జూలై 2020
Sports - May 06, 2020 , 21:52:24

కోహ్లీ కెప్టెన్సీపై నెహ్రా కామెంట్‌

కోహ్లీ కెప్టెన్సీపై నెహ్రా కామెంట్‌

న్యూఢిల్లీ:  టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కెప్టెన్సీపై భార‌త మాజీ పేస‌ర్ ఆశిష్ నెహ్రా ప‌దునైన వ్యాఖ్య‌లు చేశాడు. కోహ్లీ ఇంకా నేర్చుకునే ద‌శ‌లోనే ఉన్నాడ‌ని నెహ్రా అభిప్రాయ‌ప‌డ్డాడు. ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌లో బెంగ‌ళూరు రాయ‌ల్ చాలెంజ‌ర్స్ ఫ్రాంచైజీకి బౌలింగ్ క‌న్స‌ల్టెంట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న నెహ్రా.. మాజీ క్రికెట‌ర్ ఆకాశ్‌చోప్రాతో జ‌రిపిన సంభాష‌ణ‌లో త‌న అభిప్రాయాలు బ‌య‌ట‌పెట్టాడు. 

`ప్లేయ‌ర్‌గా విరాట్ కోహ్లీకి వంక పెట్టేది లేదు. అయితే కెప్టెన్సీ విష‌యానికొస్తే.. అత‌డు ఇంకా నేర్చుకునే ద‌శ‌లోనే (వ‌ర్క్ ఇన్ ప్రోగ్రెస్‌) ఉన్న‌ట్లు అనిపిస్తుంది` అని నెహ్రా చెప్పాడు. మాజీ ఆట‌గాడైన ఆకాశ్ చోప్రా.. ప్ర‌స్తుతం వ్యాఖ్యాతగా వ్య‌వ‌హ‌రిస్తున్న విష‌యం తెలిసిందే. క‌రోనా వైర‌స్ కార‌ణంగా క్రీడాటోర్నీల‌న్నీ ర‌ద్దు కావ‌డంతో ఆకాశ్ చోప్రా సామాజిక మాధ్య‌మాల్లో ఆకాశ‌వాణి పేరుతో ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూలు నిర్వ‌హిస్తున్నాడు. 


logo