ICC Under 19 World Cup 2024: ఉదయ్ కెప్టెన్ ఇన్నింగ్స్.. ఫైనల్లో భారత్
ICC Under 19 World Cup 2024: సౌతాఫ్రికా నిర్దేశించిన 245 పరుగుల ఛేదనలో భారత్ ఆదిలోనే నాలుగు వికెట్లు టపటపా కోల్పోయింది. ఆరంభ ఓవర్లలో సఫారీ పేసర్లు క్వెన మఫక, ట్రిస్టన్ లుస్లు నిప్పులు చెరిగారు. కానీ ఉదయ్ సహరన్ - సచిన్ దాస్‌లు ఐదో వికెట్‌కు రికార్డు భాగస్వామ్యం జతచేయడంతో భారత్ ఫైనల్ చేరింది.
ICC Under 19 World Cup 2024: ఐసీసీ అండర్ -19 పురుషుల ప్రపంచకప్‌లో యువ భారత జట్టు ఫైనల్ చేరింది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన టీమిండియా.. టోర్నీ ఆరంభం నుంచి ఓటమన్నదే లేకుండా తుదిపోరుకు అర్హత సాధించడం విశేషం. బెనోని వేదికగా సౌతాఫ్రికాతో ఆద్యంతం ఉత్కంఠభరితంగా ముగిసిన సెమీఫైనల్స్ పోరులో ఆ జట్టు బ్యాటర్లు విఫలమైనా బౌలర్ల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవడంతో విజయం కోసం భారత కుర్రాళ్లు చెమటోడ్చాల్సి వచ్చింది. ఛేదనలో ఉదయ్ సహరన్ (124 బంతుల్లో 81, 6 ఫోర్లు), కెప్టెన్ ఇన్నింగ్స్‌తో పాటు సచిన్ దాస్ (95 బంతుల్లో 96, 11 ఫోర్లు, 1 సిక్స్) లు అద్భుత ప్రదర్శనతో రాణించి భారత్‌ను ఫైనల్‌కు చేర్చారు. సఫారీ కుర్రాళ్లు నిర్దేశించిన 245 పరుగుల ఛేదనలో భారత్.. 48.5 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఆస్ట్రేలియా – పాకిస్తాన్ మధ్య జరుగనున్న రెండో సెమీస్‌లో గెలిచే విజేతతో భారత్.. ఈనెల 11న (ఆదివారం) బెనోని వేదికగా ఫైనల్ ఆడనుంది. అండర్ – 19 వరల్డ్ కప్ ఈవెంట్స్‌లో భారత్‌కు ఇది వరుసగా ఐదో ఫైనల్ కావడం గమనార్హం.
సౌతాఫ్రికా నిర్దేశించిన 245 పరుగుల ఛేదనలో భారత్ ఆదిలోనే నాలుగు వికెట్లు టపటపా కోల్పోయింది. ఆరంభ ఓవర్లలో సఫారీ పేసర్లు క్వెన మఫక, ట్రిస్టన్ లుస్లు నిప్పులు చెరిగారు. తొలి బంతికే మఫక.. ఆదర్శ్ సింగ్‌ను ఔట్ చేసి భారత్‌కు షాకిచ్చాడు. ఈ టోర్నీలో రెండు సెంచరీలు చేసిన ముషీర్ ఖాన్ (4)ను ట్రిస్టన్ లుస్ నాలుగో ఓవర్లో ఔట్ చేశాడు. 30 బంతులాడి ఒక సిక్సర్ సాయంతో 12 పరుగులు చేసిన అర్షిన్ కులకర్ణిని కూడా లుస్.. పదో ఓవర్లో వెనక్కిపంపాడు. అతడి స్థానంలో వచ్చిన ప్రియాన్షు మోలియా (5) నూ లుస్ ఔట్ చేయడంతో భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది.
మళ్లీ ఆ ఇద్దరే…
32 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన భారత్‌ను కెప్టెన్ ఉదయ్ సహరన్, మిడిలార్డర్ బ్యాటర్ సచిన్ దాస్‌లు ఆదుకున్నారు. సూపర్ సిక్స్‌లో నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీలతో చెలరేగిన ఈ జోడీ.. కీలక మ్యాచ్‌లో మరోసారి ఆదుకుంది. సఫారీ బౌలర్లు చెలరేగుతున్న క్రమంలో ఆదిలో ఆచితూచి ఆడుతూ వికెట్ కాపాడుకున్న ఈ ఇద్దరూ.. కుదురుకున్నాక బ్యాట్ ఝుళిపించారు. ఉదయ్ నెమ్మదిగానే ఆడినా సచిన్ మాత్రం వేగంగా పరుగులు రాబట్టాడు. ఒలీవర్ వేసిన 27వ ఓవర్లో వరుసగా రెండు బౌండరీలు బాది 47 బంతుల్లో అర్థ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. మరోవైపు ఉదయ్.. 87 బంతుల్లో అతడి హాఫ్ సెంచరీ పూర్తయింది. హాఫ్ సెంచరీల తర్వాత దూకుడు పెంచిన ఈ ఇద్దరూ భారత్‌ను విజయందిశగా చేర్చారు. కానీ మఫక మరోసారి భారత్‌ను దెబ్బకొట్టాడు.
India make it to their fifth consecutive Men’s #U19WorldCup Final 🎉 pic.twitter.com/ESSKCLv7GC
— ICC (@ICC) February 6, 2024
సెంచరీకి చేరువవుతున్న క్రమంలో సచిన్ దాస్‌ను మఫక 43వ ఓవర్లో ఔట్ చేశాడు. మఫక వేసిన స్లో లెంగ్త్ డెలివరనీ కవర్స్ దిశగా ఆడబోయిన సచిన్.. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న డేవిడ్ టీగర్ చేతికి చిక్కాడు. దీంతో భారత్ ఐదో వికెట్ కోల్పోవడమే గాక భాగస్వామ్యం కూడా బ్రేక్ అయింది. ఉదయ్-సచిన్‌లు ఐదో వికెట్‌కు 186 బంతుల్లో 171 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
ఆఖర్లో ఉత్కంఠ..
సచిన్ నిష్క్రమించిన తర్వాత క్రీజులోకి వచ్చిన ఎరవెల్లి అవినాశ్ (10)ను కూడా మఫక పెవిలియన్‌కు పంపాడు. ఛేదించాల్సిన లక్ష్యంతో పాటు బంతులు కూడా సమానంగా ఉండటంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. అవినాష్ స్థానంలో వచ్చిన మురుగన్ అభిషేక్ రనౌట్ అయ్యాడు. 14 బంతుల్లో 17 పరుగులు చేయాల్సి ఉండగా.. నోర్టాన్ వేసిన బంతిని రాజ్ లింబాని (4 బంతుల్లో 13 నాటౌట్, 1 ఫోర్, 1 సిక్స్) భారీ సిక్సర్ బాదడంతో భారత్ లక్ష్యానికి చేరువైంది. చివరి రెండు ఓవర్లలో భారత విజయానికి 9 పరుగులు అవసరముండగా.. మొకోయెనా వేసిన 49వ ఓవర్లోనే ఉదయ్ – లింబానిలు పనిపూర్తిచేసి భారత్‌ను ఫైనల్‌కు చేర్చారు. ఆఖర్లో ఉదయ్ రనౌట్ అయినా అప్పటికే భారత విజయం ఖరారైంది. లింబాని ఐదో బంతిని బౌండరీకి తరలించడంతో సఫారీలకు మరోసారి ఐసీసీ ట్రోఫీలలో షాక్ తప్పలేదు. సఫారీ యువ పేసర్ క్వెనా మఫక (3-32), ట్రిస్టన్ లుస్ (3-37)లు రాణించారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

