World Cup Trophy | బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ (Shah Rukh Khan) వన్డే ప్రపంచకప్ ట్రోఫీ (World Cup Trophy) తో ఉన్న ఫొటోను ఐసీసీ (ICC) సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘కింగ్ ఖాన్ చేతిలో సీడబ్ల్యూసీ 23 ట్రోఫీ.. మరింత దగ్గరగా’ అని క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్ అవుతోంది.
కాగా, ప్రపంచకప్ 2023 ట్రోఫీని ఐసీసీ చారిత్మాత్మకంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. ఎవరూ ఊహించని విధంగా ట్రోఫీని ఈ ఏడాది స్పేస్ లో లాంచ్ చేయడం విశేషం. భూమికి 1,20,000 అడుగుల ఎత్తులో ట్రోఫీని ఆవిష్కరించింది. బెలూన్ సాయంతో ట్రోఫీని నింగిలోకి పంపారు. ఆ తర్వాత ట్రోఫీ నేరుగా అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో దిగింది. ప్రస్తుతం ప్రపంచకప్ ట్రోఫీ వరల్డ్ టూర్ లో ఉంది. టోర్నమెంట్ లో పాల్గొనే అన్ని దేశాల్లో ట్రోఫీ సందర్శన ఉంటుంది. కాగా, ప్రపంచకప్ ప్రమోషన్స్ లో భాగంగా ఐసీసీ షారుక్ ఫోటో పంచుకుంది. ఐసీసీ షేర్ చేసిన ఈ ఫొటోకు లక్షల్లో లైక్స్, కామెంట్స్ వస్తున్నాయి. దీనిపై నెటిజన్లు, క్రికెట్ అభిమానులు రకరకాలు కామెంట్స్ చేస్తున్నారు. ‘ఇక ప్రపంచకప్ ను గెలవకుండా భారత్ ను ఎవరూ ఆపలేరు’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
King Khan 🤝 #CWC23 Trophy
It’s nearly here … pic.twitter.com/TK55V3VkfA
— ICC (@ICC) July 19, 2023
Also Read..
Samantha | ధ్యానం ప్రశాంతతకి అత్యంత శక్తివంతమైన మార్గం.. సమంత పోస్ట్ వైరల్
Parliament Monsoon Session | లోక్ సభ మధ్యాహ్నానికి వాయిదా
Road Accident | యాక్సిడెంట్ జరిగిన చోట గుమిగూడిన జనంపైకి దూసుకెళ్లిన కారు.. 9 మంది మృతి