హైదరాబాద్: చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ ఎంస్ ధోనీ(MS Dhoni).. ఆ జట్టుతోనే భవిష్యత్తులో కొనసాగనున్నాడు. ఇటీవల జరిగిన ఓ ఈవెంట్లో అతను ఆ క్లారిటీ ఇచ్చాడు. 2008 నుంచి ఐపీఎల్లో చెన్నై టీమ్‌తోనే ధోనీ ఆడుతున్నాడు. అతని సారథ్యంలో ఆ జట్టు అయిదుసార్లు టైటిల్ కూడా నెగ్గింది. అయితే గత కొన్ని సీజన్ల నుంచి సీఎస్కే జట్టు సరిగా పర్ఫార్మ్ చేయడం లేదు. దీంతో ధోనీ కెప్టెన్సీ సామర్థ్యంపై అనుమానాలు వ్యక్తం అయ్యాయి. చివరి సీజన్లో రుతురాజ్ గైక్వాడ్ .. సీఎస్కే కెప్టెన్‌గా బాధ్యలు చేపట్టాడు. ధోనీ కెరీర్ ముగిసిందా అన్న అనుమానాలకు అతనే తెరదింపాడు.
మళ్లీ పసుపు రంగు జెర్సీలోనే ఐపీఎల్ ఆడుతారా అని అడిగిన ప్రశ్నకు ఎంస్ ధోనీ సమాధానం ఇచ్చారు. తన నిర్ణయం తాను తీసుకునేందుకు చాలా సమయం ఉందని, ఎప్పుడూ ఎల్లో జెర్సీలోనే ఆడుతానన్నాడు. క్రికెట్ ఆడినా, ఆడకపోయినా.. తన జర్నీ ఎల్లో జెర్సీలోనే కొనసాగుతుందన్నాడు. నేను, సీఎస్కే ఒకే దగ్గర ఉన్నామన్నారు.
చెన్నై జట్టుతో రిలేషన్ పెరిగిందని, ఓ వ్యక్తిగా ఎదగడానికి ఆ అనుభం ఎంతో సహకరించిందని, క్రికెటర్‌గా చాలా ఇంప్రూవ్ అయ్యానని, చెన్నైకి ఇది మంచిదే అని, తనకు కూడా వ్యక్తిగతంగా మంచిదే అని ధోనీ పేర్కొన్నాడు. 2025 సీజన్లో పాయింట్ల పట్టికలో చెన్నై జట్టు చివరి స్థానంలో నిలిచింది.