 
                                                            సార్‌బ్రుకెన్ : జర్మనీలో జరుగుతున్న హైలో ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్ కిరణ్ జార్జి సంచలన ప్రదర్శన చేశాడు. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో 38వ ర్యాంకర్ జార్జి.. 18-21, 21-18, 21-19తో ఎనిమిదో సీడ్, ప్రపంచ 13వ ర్యాంకర్ తొమ జూనియర్ పొపొవ్ (ఫ్రాన్స్)కు షాకిచ్చి క్వార్టర్స్ చేరాడు.
మరో పోరులో లక్ష్యసేన్.. 21-14, 21-11తో భారత్‌కే చెందిన శంకర్ సుబ్రహ్మణ్యన్ను ఓడించాడు. మహిళల సింగిల్స్‌లో రక్షిత రామ్రాజ్.. 19-21, 21-18, 21-13తో వలిశెట్టి శ్రీయాన్షిపై గెలిచి క్వార్టర్స్‌కు అర్హత సాధించింది.
 
                            