హైదరాబాద్, ఆట ప్రతినిధి: జాతీయ పవర్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ లిఫ్టర్ సాగర్ అమృత్‌సింగ్ పసిడి పతకంతో మెరిశాడు. 75కిలోల విభాగంలో పోటీపడ్డ సాగర్ స్కాట్‌లో 50కిలోలు, బెంచ్‌ప్రెస్‌లో 65కిలోలు, డెడ్‌లిఫ్ట్‌లో 130కి, మొత్తంగా 245 కిలోలు ఎత్తి అగ్రస్థానంలో నిలిచాడు.
60శాతానికి పైగా వినికిడి సమస్య ఉన్న సాగర్ ఓపెన్ కేటగిరీలో సత్తాచాటడం విశేషం. స్వర్ణం సాధించిన సాగర్‌ను రాష్ట్ర డబ్ల్యూపీసీ పవర్‌లిఫ్టింగ్ అధ్యక్షురాలు రేఖ అభినందించింది.