మంజేరి : సూపర్‌కప్ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో సూపర్‌లీగ్ మాజీ విజేత హైదరాబాద్ ఎఫ్‌సీ తమ తొలి మ్యాచ్ లో 2-1తో ఐజ్వాల్ ఎఫ్‌సీపై గెలిచి శుభారంభం చేసింది. 17వ నిమిషంలో జోయల్ జోసెఫ్ హైదరాబాద్‌కు బోణీ చేశాడు. బోర్జా గొంజాల్ గోల్‌లోకి కొట్టిన బంతిని ఐజ్వాల్ గోల్‌కీపర్ వెనక్కి నెట్టగా అక్కడే ఉన్న జోయల్ తిరిగి నెట్లోకి కొట్టాడు.
విరామానంతరం 50వ నిమిషంలో మిడ్‌ఫీల్డర్ జావొ విక్టర్ పెనాల్టీ షాట్‌ను గోల్‌గా మలిచి హైదరాబాద్ ఆధిక్యాన్ని రెట్టింపు చేశాడు. చివరి క్షణాల్లో వెరాస్ ఐజ్వాల్‌కు గోల్ సాధించి అంతరాన్ని తగ్గించాడు. స్కోరు సమం చేసేందుకు ఐజ్వాల్ ప్రయత్నాలన్నింటిని హైదరాబాద్ రక్షణశ్రేణి వమ్ము చేసింది.