హైదరాబాద్, ఆట ప్రతినిధి: భవిష్యత్‌లో రంజీ మ్యాచ్‌లు నిర్వహించేలా మహబూబ్‌నగర్ స్టేడియాన్ని తీర్చిదిద్దుతామని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) అధ్యక్షుడు జగన్మోహన్రావు పేర్కొన్నారు. సోమవారం పాలమూరు స్టేడియంలో టర్ఫ్ వికెట్ నిర్మాణ పనులకు భూమిపూజ నిర్వహించారు.
గ్రామీణ క్రికెట్‌ను అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో 80లక్షల వ్యయం తో టర్ఫ్ వికెట్ సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. శంషాబాద్ నుంచి మహబూబ్‌నగర్ స్టేడియం సమీపంలో ఉండటంతో భవిష్యత్‌లో రంజీ మ్యాచ్‌లు నిర్వహించేందుకు ఆస్కారముందని అన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్‌సీఏ కార్యవర్గ సభ్యులు దేవరాజ్, బసవరాజ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.