సిరాజ్ సేన శుభారంభం
టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ నాయకత్వంలో బరిలోకి దిగిన హైదరాబాద్ రంజీ ట్రోఫీని భారీ విజయంతో ఆరంభించింది. జింఖానా గ్రౌండ్స్‌లో మంగళవారం ముగిసిన ఎలైట్ గ్రూప్-బీ మ్యాచ్‌లో సిరాజ్ సేనఇన్నింగ్స్ 40 రన్స్ తేడాతో త్రిపురను చిత్తుగా ఓడించి టోర్నీలో శుభారంభం చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో ఓవర్‌నైట్ స్కోరు 106/7తో మూడో రోజు బ్యాటింగ్‌కు వచ్చిన త్రిపుర.. మరో 14 రన్స్ మాత్రమే జోడించి 120 రన్స్‌కు కుప్పకూలింది.
- త్రిపురపై ఇన్నింగ్స్ 40 రన్స్‌తో ్ర గాండ్ విక్టరీ
- తనయ్‌కు ఆరు వికెట్లు
హైదరాబాద్, ఆట ప్రతినిధి: టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ నాయకత్వంలో బరిలోకి దిగిన హైదరాబాద్ రంజీ ట్రోఫీని భారీ విజయంతో ఆరంభించింది. జింఖానా గ్రౌండ్స్‌లో మంగళవారం ముగిసిన ఎలైట్ గ్రూప్-బీ మ్యాచ్‌లో సిరాజ్ సేనఇన్నింగ్స్ 40 రన్స్ తేడాతో త్రిపురను చిత్తుగా ఓడించి టోర్నీలో శుభారంభం చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో ఓవర్‌నైట్ స్కోరు 106/7తో మూడో రోజు బ్యాటింగ్‌కు వచ్చిన త్రిపుర.. మరో 14 రన్స్ మాత్రమే జోడించి 120 రన్స్‌కు కుప్పకూలింది. హైదరాబాద్ బౌలర్లలో తనయ్ త్యాగరాజన్ (6/52) ఆరు వికెట్లతో సత్తాచాటగా కెప్టెన్ సిరాజ్ (2/19) రెండు వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో హైదరాబాద్ 294 పరుగులు చేసిన విషయం తెలిసిందే. ఈ విజయంతో హైదరాబాద్ ఖాతాలో బోనస్ సహా 8 పాయింట్లు చేరాయి.
ముంబై, యూపీ ‘భారీ’గానే..
ముంబై ఈ సీజన్‌ను భారీ విజయంతో మొదలెట్టింది. వాంఖెడేలో జరిగిన ఫస్ట్ మ్యాచ్‌లో ఆ జట్టు ఇన్నింగ్స్ 155 పరుగుల తేడాతో చండీగఢ్‌ను చిత్తుచేసింది. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ముంబై 429 పరుగుల భారీ స్కోరు చేయగా తొలి ఇన్నింగ్స్‌లో 78 రన్స్‌కే కుప్పకూలిన చండీగఢ్.. రెండో ఇన్నింగ్స్‌లో ఫాలో ఆన్ ఆడుతూ 196కే పరిమితమైంది. మరో పోరులో ఉత్తరప్రదేశ్ కూడా బీహార్‌ను చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్ చేసి 540 రన్స్ సాధించిన యూపీ.. బీహార్‌ను వరుసగా రెండు ఇన్నింగ్స్‌ల్లో 141, 132 స్కోర్లకే ఆలౌట్ చేసింది. దాంతో ఇన్నింగ్స్ 267 పరుగులతో విజయం సాధించింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

