బాకు: ప్రతిష్ఠాత్మక షూటింగ్ ప్రపంచకప్లో భారత షూటర్ల పతక జోరు దిగ్విజయంగా కొనసాగుతున్నది. శుక్రవారం జరిగిన పురుషుల 10మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో హృదయ్ హజారికా రజత పతకంతో మెరిశాడు.
251.9 పాయింట్లతో హృదయ్ రెండో స్థానంలో నిలిచాడు. మరోవైపు మహిళల 10మీటర్ల రైఫిల్ ఫైనల్లో నాన్సి(253.3) రజత పతకం దక్కించుకుంది. మెగాటోర్నీలో ఇప్పటి వరకు భారత్ నాలుగు పతకాలతో రెండో స్థానంలో కొనసాగుతున్నది.