తాష్కెంట్ : భారత యువ అథ్లెట్ హీనా రెజోనా మల్లిక్ ఆసియన్ యూత్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో సరికొత్త రికార్డు సృష్టించింది. హీనా 400మీ. పరుగులో తాను నెలకొల్పిన జాతీయ రికార్డును బద్దలు కొట్టడమే గాక, 52.98 సెకండ్లలో సరికొత్త ఆసియన్ రికార్డును నెలకొల్పి గతంలో సల్వా ఈద్ నసర్ పేరిట ఉన్న రికార్డు (53.02సె.)ను తిరగరాసింది. 400మీ.లో ఇది మూడో అత్యుత్తమ టైమింగ్.