హైదరాబాద్: సన్‌రైజర్స్ హైదరాబాద్(ఎస్ఆర్హెచ్) ప్రధాన కోచ్‌గా న్యూజిలాండ్ దిగ్గజ క్రికెటర్ డానియల్ వెటోరీ నియమితుడయ్యాడు. గత ఏడాదిగా కోచ్‌గా కొనసాగుతున్న బ్రియాన్ లారాతో సన్‌రైజర్స్ తెగదెంపులు చేసుకుంది. లారా స్థానంలో వెటోరీ చీఫ్ కోచ్‌గా వ్యవహరిస్తాడంటూ ఎస్ఆర్హెచ్ తమ అధికారిక ట్విట్టర్లో సోమవారం పేర్కొంది.
గతంలో ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)కు నాలుగేండ్ల పాటు వెటోరీ కోచ్‌గా వ్యవహరించాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు సహాయక కోచ్‌గా ఉన్న ఈ లెజెండరీ స్పిన్నర్..హండ్రెడ్ టోర్నీలోనూ బర్మింగ్‌హామ్ ఫోనిక్స్ టీమ్‌కు సేవలందిస్తున్నాడు. ఆర్సీబీకి కోచ్‌గా వ్యవహరించిన సమయంలో 2016లో ఫైనల్ చేర్చడంలో వెటోరీ కీలకమయ్యాడు.