Sunil Gavaskar : భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) పోరాటం ఫలించింది. ఆన్లైన్లో కొందరు తన పేరును, ఫొటోలను దుర్వినియోగం చేస్తున్నారని హైకోర్టును ఆశ్రయించిన లెజెండరీ ఆటగాడికి రక్షణ లభించింది. గవాస్కర్ ప్రతిష్టకు భంగం కలిగించేలా పెట్టిన పోస్టులను వెంటనే తొలగించాలని ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) తీర్పునిచ్చింది. ఇకపై ఈ మాజీ క్రికెటర్ పేరును, ఫొటోలను, వీడియోలను వ్యక్తిగత ప్రయోజనాలకు ఉపయోగించడాన్ని సహించబోమని కోర్టు స్పష్టం చేసింది. దాంతో.. కోర్టు నుంచి ఆన్లైన్ భద్రత పొందిన మొట్టమొదటి భారత క్రీడాకారుడిగా గవాస్కర్ గుర్తింపు సాధించాడు.
నిత్యం క్రీడా విశ్లేషణలతో వార్తల్లో నిలిచే గవాస్కర్ ఈమధ్య టీమిండియా వైఫల్యానికి హెడ్‌కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir)ను నిందిస్తూ తీవ్ర విమర్శలు చేశాడు. అలానే కొందరు ఆటగాళ్ల ప్రదర్శనను ఎండగట్టాడు కూడా. అయితే.. గౌతీపై, కొందరు ఆటగాళ్లపై అతడు చేయని కొన్ని కామెంట్లను అతడికి ఆపాదిస్తూ కొందరు ఎక్స్, మెటా, గూగుల్‌లో పోస్ట్‌లు పెట్టారు.
#BREAKING: The Delhi High Court has protected former cricketer Sunil Gavaskar’s personality rights, ordering social media platforms to remove false statements and e-commerce sites to delist infringing products within 72 hours. The court listed the next hearing for May 22, 2026 pic.twitter.com/dTyedjxqxU
— IANS (@ians_india) December 23, 2025
దాంతో.. తన ఫొటోలను, వీడియోలను దుర్వినియోగం చేయడాన్ని సీరియస్‌గా తీసుకున్న ఆయన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. ఆయన ఫిర్యాదును విచారించిన జస్టిస్ హన్మీత్ ప్రీతమ్ సింగ్ ఆరోరా (Justice Manmeet Pritam Singh Arora) బెంచ్ సదరు యూఆర్ఎల్స్ (URL) వివరాలను రెండు రోజుల్లో కోర్టుకు సమర్పించాలని సూచించింది. బెంచ్ ఆదేశాల మేరుకు గవాస్కర్ తన పేరును దుర్వినియోగం చేస్తున్న యూఆర్ఎల్స్ వివరాలను తెలియజేశాడు.
మంగళవారం గవాస్కర్ తరఫున సీనియర్ న్యాయవాది గోపాల్ జైన్ వాదనలు వినిపించారు. ఆయన సమర్పించిన యూఆర్ఎల్స్ను పరిశీలించిన ధర్మాసనం.. సోషల్ మీడియా, ఈ కామర్స్ సంస్థల వైబ్సైట్ల నుంచి సదరు పోస్ట్‌లను 72 గంటల్లోగా తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ ఏ సంస్థ అయినా గవాస్కర్ ఫొటోలు, వీడియోలను ఉపయోగిస్తుంటే కోర్టు ధిక్కరణ కేసు పెడుతామని హెచ్చరించింది.
Delhi High Court to hear the personality rights suit filed by former cricketer and cricket commentator Sunil Gavaskar. pic.twitter.com/LJdWYudSnI
— Bar and Bench (@barandbench) December 23, 2025