Heinrich Malan | ఐర్లాండ్‌కు ఊహించని షాక్.. హెడ్‌కోచ్ మలన్ రాజీనామా..!
Heinrich Malan : భారత జట్టుపై చరిత్రాత్మక సిరీస్ విజయంతో సంబురాల్లో మునిగితేలుతున్న ఐర్లాండ్ (Ireland)కు ఊహించిన షాక్ తగిలింది. హెడ్‌కోచ్ హెన్రిచ్ మలన్ (Heinrich Malan) రాజీనామా చేశాడు.
Heinrich Malan : భారత జట్టుపై చరిత్రాత్మక సిరీస్ విజయంతో సంబురాల్లో మునిగితేలుతున్న ఐర్లాండ్ (Ireland)కు ఊహించిన షాక్ తగిలింది. పొట్టి సిరీస్‌లో ఐరిష్ జట్టు విజేతగా నిలవడంలో కీలకమైన హెడ్‌కోచ్ హెన్రిచ్ మలన్ (Heinrich Malan) రాజీనామా చేశాడు. మూడుసార్లు టీ20 ఛాంపియన్ టీమిండియాను క్లీన్‌స్వీప్ చేసిన టీమ్‌కు కోచ్‌గా ప్రశంసలందుకుంటున్న మలన్ సగర్వంగా తన బాధ్యతల నుంచి వైదొలిగాడు.
పొట్టి క్రికెట్లో మేటి జట్టైన భారత్‌పై 2-0తో సిరీస్ గెలుపొందిన ఐర్లాండ్ సంతోషం ఒక్కరోజులోనే ఆవిరైంది. పసికూనగా ముద్రపడిన ఆ జట్టులో పోరాటపటిమను నింపిన కోచ్ హెన్రిచ్ మలన్ హఠాత్తుగా రాజీనామా చేశాడు. మలన్ వైదొలగడంతో అతడి స్థానంలో గ్యారీ విల్సన్(Gary Wilson)ను కోచ్‌గా నియమించింది. కోచ్‌గా ఉన్నత స్థాయిలో వీడ్కోలు పలికిన మలన్ తన హయాంలో సాధించిన విజయాలను గుర్తు చేసుకున్నాడు.
Head coach Heinrich Malan has stepped down following Ireland’s 2-0 T20I series sweep over India.
Gary Wilson has been appointed as his successor, becoming the first Irish-born head coach of the men’s team in more than 30 years pic.twitter.com/8C9sga4Z5X
— Cricinfo (@cricinfo) June 29, 2026
‘ఐర్లాండ్ ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బందితో కలిసి పనిచేయడం నాకు దక్కిన గొప్ప గౌరవం. రెండేళ్ల క్రితం.. పొట్టి ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌పై చరిత్రాత్మక విజయం మనకెంతో గర్వకారణం. అబుధాబీలో అఫ్గనిస్థాన్‌పై తొలి టెస్టు విజయం, సొంతగడ్డపై బెల్ఫాస్ట్లో జింబాబ్వేపై గెలుపు.. టీ20 సిరీస్‌లో భారత్, పాకిస్థాన్, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా వంటి పెద్ద జట్లను ఓడించడం ఐర్లాండ్ క్రికెట్ గర్వించదగ్గవి. పొట్టి వరల్డ్‌కప్ టోర్నీకి నేరుగా అర్హత సాధించడం మన జట్టు నిలకడకు కొలమానం’ అని మలన్ వెల్లడించాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
పికిల్‌బాల్ ‘రోడ్ టు నేషనల్స్’ విజేతలకు అభినందనలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

