Health Worker | వ్యాక్సిన్ వేసే నర్సు.. సెలవు పెట్టిందని రెచ్చిపోయిన వ్యక్తి.. వీడియో వైరల్
Health Worker | ఉద్యోగులన్నాక ఏదో ఒక సందర్భంలో అనుకోకుండా సెలవులు పెట్టడం సహజం. అలా ప్రతి మనిషికీ జరుగుతూనే ఉంటుంది. ఒక్కోసారి సడెన్‌గా కొన్ని కారణాల వల్ల ఆఫీసుకు రాలేకపోవచ్చు.

ఉద్యోగులన్నాక ఏదో ఒక సందర్భంలో అనుకోకుండా సెలవులు పెట్టడం సహజం. అలా ప్రతి మనిషికీ జరుగుతూనే ఉంటుంది. ఒక్కోసారి సడెన్‌గా కొన్ని కారణాల వల్ల ఆఫీసుకు రాలేకపోవచ్చు. అలాగే ఏదో పని ఉండటంతో సెలవు పెట్టిందా హెల్త్ వర్కర్. ఆ మరుసటి రోజు ఆస్పత్రికి వెళ్లే సరికి ఆమెపై దాడికి దిగాడో వ్యక్తి.
ఈ ఘటన బిహార్‌లోని జాముయ్ జిల్లాలో వెలుగు చూసింది. స్థానికంగా ఉన్న ఆస్పత్రిలో ఒక మహిళ ఆక్సిలరీ నర్సుగా పనిచేస్తుంది. బుధవారం నాడు ఏదో కారణం వల్ల ఆమె ఉద్యోగానికి రాలేదు. ఆ మరుసటి రోజు అంటే గురువారం ఉద్యోగానికి వచ్చింది. అలా వచ్చినప్పుడే ఆస్పత్రికి చెందిన ఒక వ్యక్తి ఆమెతో వాగ్వాదానికి దిగాడు.
ఆమె కూడా కొంచెం గట్టిగా మాట్లాడింది. అంతే ఆమెపై దాడి చేసేందుకు ప్రయత్నించాడు. అయితే చుట్టు పక్కల వాళ్లు వెంటనే రంగంలోకి దిగి అతన్ని అడ్డుకున్నారు. ఈ విషయం తెలిసిన హెల్త్ వర్కర్లు అందరూ సదరు ఆస్పత్రి ముందు ధర్నాకు దిగారు.
వ్యాక్సినేషన్ డ్యూటీలో ఉన్న వాళ్లంతా తమ కిట్లతో సహా ఆస్పత్రి ముందు చేరి దాడికి యత్నించిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా మరోసారి వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో వ్యాక్సినేషన్ ప్రక్రియకు ఇలా బ్రేకులు పడటం మంచిది కాదని నిపుణులు అంటున్నారు.
वैक्सिनेशन के काम में लगे एक एएनएम के साथ जमुई ज़िले के चकाई रेफ़रल अस्पताल के वरीय स्टाफ़ कैसे मारपीट कर रहे हैं देखिए इसका एक विडीओ @ndtvindia @Anurag_Dwary @Suparna_Singh pic.twitter.com/HMPnQmJU9X
— manish (@manishdekoder) January 7, 2022
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

