SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
SA vs AUS : డర్బన్ టెస్టులో పట్టుబిగించిన ఆస్ట్రేలియా(Australia) విజయం దిశగా తొలి అడుగు వేసింది. తడబడుతున్న దక్షిణాఫ్రికా (South Africa)కు సవాల్ విసురుతూ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన ఆసీస్ మొదటి వికెట్ సాధించింది.
SA vs AUS : డర్బన్ టెస్టులో పట్టుబిగించిన ఆస్ట్రేలియా(Australia) విజయం దిశగా తొలి అడుగు వేసింది. స్వదేశంలో తడబడుతున్న దక్షిణాఫ్రికా (South Africa)కు సవాల్ విసురుతూ నాలుగో రోజే ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన ఆసీస్ మొదటి వికెట్ సాధించింది. 421 పరుగుల ఛేదనలో దంచేయాలనుకున్న రియాన్ రికెల్టన్(2)ను హేజిల్‌వుడ్(1-1) వెనక్కి పంపాడు. రెండో ఇన్నింగ్స్ మొదలెట్టిన నాలుగో ఓవర్లోనే ఓపెనర్‌ను కోల్పోయిన సఫారీ జట్టు గెలుపు బాధ్యత మర్క్రమ్(9 నాటౌట్), బెడింగమ్ల మీద పడింది.
ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ 2025-27లో కీలకమైన డర్బన్ టెస్టులో అదరగొడుతున్న ఆస్ట్రేలియా గెలుపే లక్ష్యంగా కదులుతోంది. మ్యాట్ రెన్షా(82) రాణించడంతో నాలుగో రోజు మూడో సెషన్లోనే ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది ఆసీస్. తొలి ఇన్నింగ్స్‌లో శతకం(190)తో కంగారూ టీమ్‌ను ఒడ్డునపడేసిన రెన్షా రెండో ఇన్నింగ్స్‌లోనూ దక్షిణాఫ్రికా బౌలర్లను ఉతికేశాడు. ఆధిక్యం నాలుగొందలు దాటడంతో కెప్టెన్ ప్యాట్ కమిన్స్ 314-6వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు.
That’s how Josh hazlewood dismissed Ryan rickleton……
#SavsAus https://t.co/2aCEfSH9BM— Mayureshhhh…… (@Mayuresh_0718) October 12, 2026
అనంతరం 421 పరుగుల ఛేదనలో బ్యాటింగ్‌కు దిగిన తెంబ బవుమా జట్టుకు ఆదిలోనే హేజిల్‌వుడ్(1-1) షాకిచ్చాడు. భారీ లక్ష్యాన్ని ఉఫ్మనిపిద్దామనే ఆలోచనతో క్రీజులోకి వచ్చిన రియాన్ రికెల్టన్(2)ను అతడు ఊరించే బంతితో బోల్తా కొట్టించాడు. వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ సూపర్ క్యాచ్ అందుకోగా 7 పరుగులకే అతడు వెనుదిరగగా మర్క్రమ్(9), డేవిడ్ బెడింగమ్లు భాగస్వామ్యం నిర్మిస్తున్నారు. నాలుగో రోజు ఇంకా40 ఓవర్ల ఆట బాకీ ఉండగా.. ఆతిథ్య జట్టు విజయానికి 410 రన్స్ కావాలి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
Yash | సర్దార్ డైరెక్టర్‌తో యశ్ సినిమా.. క్రేజీ టాక్ నిజమయ్యేనా..?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

