Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Hasan Mahmud: బంగ్లాదేశ్ క్రికెట్లో పేస్ సంచలనంగా మారిన హసన్ మహమూద్ (Hasan Mahmud) ఈసారి హ్యాట్రిక్‌తో మెరిశాడు. అఫ్గనిస్థాన్ (Afghanistan)తో ఏకైక టెస్టులో వరస బంతుల్లో మూడు వికెట్లతో చెలరేగాడు.
Hasan Mahmud: బంగ్లాదేశ్ క్రికెట్లో పేస్ సంచలనంగా మారిన హసన్ మహమూద్ (Hasan Mahmud) ఈసారి హ్యాట్రిక్‌తో మెరిశాడు. ఆస్ట్రేలియాపై డార్విన్ టెస్టులో చరిత్రాత్మక విజయంలో భాగమైన అతడు అఫ్గనిస్థాన్ (Afghanistan)తో ఏకైక టెస్టులో వరస బంతుల్లో మూడు వికెట్లతో చెలరేగాడు. తద్వారా సుదీర్ఘ ఫార్మాట్లో హ్యాట్రిక్ నమోదు చేసిన బంగ్లాదేశ్ మొట్టమొదటి పేసర్‌గా అవతరించాడు. మొత్తంగా రెడ్ బాల్ క్రికెట్లో తమ దేశం నుంచి ఈ ఫీట్ సాధించిన మూడో బౌలర్‌గా హసన్ గుర్తింపు సాధించాడు.
అఫ్గనిస్థాన్‌తో అబుధాబీలో జరుగుతున్న ఏకైక టెస్టులో హసన్ మహమూద్ నిప్పులు చెరిగాడు. పదునైన పేస్‌తో కాబూలీ బ్యాటర్లను ఇరుకున పెట్టిన అతడు 83వ ఓవర్లో హ్యాట్రిక్ వికెట్లు తీశాడు. మూడో బంతికి ఇస్మత్ అలంను క్లీన్ బౌల్డ్ చేసిన హసన్.. ఆ తర్వాత బంతికి కైస్ అహ్మద్‌ను వెనక్కి పంపాడు. హ్యాట్రిక్ బంతికి జియా ఉర్ రెహ్మాన్‌ను ఎల్బీగా ఔట్ చేసి చరిత్ర లిఖించాడీ స్పీడ్‌స్టర్. తద్వారా టెస్టుల్లో హ్యాట్రిక్ తీసిన బంగ్లా తొలి పేసర్‌గా హసన్ అవతరించాడు.
Hasan Mahmud become first Bangladeshi pacer to pick a hat tric in test cricket
#BanvsAfg
#TestCricket https://t.co/7tYnt5J8o6— @CricketPulse (@VikashJajra4500) October 11, 2026
హసన్ కంటే ముందు టెస్టుల్లో మాజీ స్పిన్నర్లు అలోక్ కపాలి (Alok Kapali), షోహగ్ గజీ (Sohag Gazi)లు ఈ ఫీట్ సాధించారు. పాకిస్థాన్‌పై 2003 ఆగస్టులోకపాలి తన స్పిన్ మ్యాజిక్ చూపిస్తూ వరస బంతుల్లో టెయిలెండర్లు షబ్బీర్ అహ్మద్, డానిష్ కనేరియా, ఉమర్ గుల్‌ను పెవిలియన్ పంపాడు. ఆ తర్వాత పదేళ్లకు న్యూజిలాండ్‌పై గజీ.. కొరే అండర్సన్, వాల్టింగ్, బ్రేస్‌వెల్‌ను ఔట్ చేయడం ద్వారా హ్యాట్రిక్ నమోదు చేశాడు.
వన్డేల్లో ఐదుగురు
అంతర్జాతీయ క్రికెట్ మూడు ఫార్మాట్లను పరిగణిస్తే.. వన్డేల్లో ఐదుగురు బంగ్లా బౌలర్లు హ్యాట్రిక్ వికెట్లతో ఔరా అనిపించారు. షహదాత్ హొసేన్ 2006లో జింబాబ్వేపై, అబ్దుల్ రజాక్ 2010లో జింబాబ్వేపై, రూబెల్ హొసేన్ 2013లో న్యూజిలాండ్‌పై, తైజుల్ ఇస్లాం 2014లో జింబాబ్వేపై, తస్కిన్ అహ్మద్ 2017లో శ్రీలంకపై హ్యాట్రిక్ వీరులుగా నిలిచారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
Riyadh airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్..!
Suchitra Flyover | సుచిత్ర ఫ్లైఓవర్ పనులు వెంటనే ప్రారంభించాలి.. ఫ్లైఓవర్‌కు పిండ ప్రదానం.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

