బెంగళూరు : ప్రొ కబడ్డీ లీగ్‌లో ఆదివారం ఉత్కంఠ పోరులో హర్యానా స్టీలర్స్ 35-33 స్కోరుతో దబాంగ్ ఢిల్లీపై గెలుపొందింది. హర్యానా జట్టులో సిద్దార్ధ్ 10, ఆశిష్ 7, వినయ్ 5 పాయింట్లు సాధించగా, ఢిల్లీ జట్టులో నవీన్‌కుమార్ అత్యధికంగా 16 పాయింట్లు సాధించినా జట్టును గెలిపించలేకపోయాడు.
మరో మ్యాచ్‌లో బెంగాల్ వారియర్స్ 48-38తో తమిళ్ వారియర్స్‌ను ఓడించింది.