IPL 2025 : ఉప్పల్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్(Punjab Kings) తొలి వికెట్ కోల్పోయింది. గత మ్యాచ్ సెంచరీ వీరుడు ప్రియాన్ష్ ఆర్య(36) సిక్సర్లతో విరుచుకుపడినా త్వరగానే ఔటయ్యాడు. హర్షల్ పటేల్ బౌలింగ్ పెద్దషాట్ ఆడి.. నితీశ్ కుమార్ రెడ్డి చేతికి చిక్కాడీ చిచ్చరపిడుగు. దాంతో, 66 వద్ద పంజాబ్ తొలి వికెట్ పడింది. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ శ్రేయస్ అయ్యార్(9) సైతం ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్(41)తో కలిసి దూకుడుగా ఆడుతున్నాడు. దాంతో పవర్ ప్లేలో వికెట్ నష్టానికి పంజాబ్ 89 రన్స్ కొట్టింది.
టాస్ గెలిచిన పంజాబ్‌కు ఓపెనర్లు ప్రభ్‌సిమ్రన్ సింగ్(41), ప్రియాన్ష్ ఆర్య(36)లు ఆదిరే ఆరంభం ఇచ్చారు. షమీ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లో ప్రభ్‌సిమ్రన్ హ్యాట్రిక్ ఫోర్లతో అలరించాడు. ఆ తర్వాత కమిన్స్ బౌలింగ్‌లో ప్రియాన్ష్ రెచ్చిపోయాడు. వరుసగా 6, 4 బాదగా.. ఆఖరి బంతిని ప్రభ్‌సిమ్రన్ బౌండరీకి తరలించాడు. షమీ రెండో ఓవర్లో ప్రియాన్ష్ వరుసగా 6, 6, 4 కొట్టి జట్టు స్కోర్ 50 దాటించాడు. ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న ఈ జోడీని హర్షల్ పటేల్ విడదీసి సన్‌రైజర్స్‌కు బ్రేకిచ్చాడు.
𝘑𝘶𝘴𝘵 𝘴𝘪𝘵 𝘣𝘢𝘤𝘬 & 𝘸𝘢𝘵𝘤𝘩 𝘵𝘩𝘦 𝘣𝘢𝘭𝘭 𝘧𝘭𝘺 🔥
Total Carnage from #PBKS openers Prabhsimran Singh & Priyansh Arya! 💪
PBKS are 89/1 at the end of powerplay.
Updates ▶ https://t.co/RTe7RlXDRq #TATAIPL | #SRHvPBKS | @PunjabKingsIPL pic.twitter.com/P0aQBLqxeI
— IndianPremierLeague (@IPL) April 12, 2025