న్యూఢిల్లీ: భారత యువ లిఫ్టర్ హర్షద గరుడ్.. ఆసియా యూత్ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్షిప్లో సంచలన ప్రదర్శన కనబర్చింది. అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్న 18 ఏండ్ల హర్షద 45 కేజీల విభాగంలో పసిడి పతకం కైవసం చేసుకుంది. పోటీల్లో హర్షద 157 కేజీల (69+88) బరువెత్తి అగ్రస్థానంలో నిలిచింది. ఇటీవల జూనియర్ ప్రపంచ చాంపియన్షిప్లో 153 కేజీల బరువెత్తి స్వర్ణం నెగ్గిన హర్షద.. తాజా పోటీల్లో మరో నాలుగు కేజీలతో తన వ్యక్తిగత ప్రదర్శనను మరింత మెరుగుపర్చుకుంది. ఇదే విభాగంలో భారత్కు చెందిన సౌమ్య దేవి (145 కేజీలు) కాంస్యం చేజిక్కించుకోగా.. బాలుర 49 కేజీల స్నాచ్ ఈవెంట్లో ధనుష్ (185 కేజీలు) కాంస్యం కైవసం చేసుకున్నాడు.