INDA vs OMNA : ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో భారత ఏ జట్టు రెండో విక్టరీ కొట్టింది. మంగళవారం ఒమన్ జట్టును 6 వికెట్ల తేడాతో ఓడించింది. 136 పరుగుల ఛేదనలో హర్ష్ దూబే(53 నాటౌట్) అర్ధశతకంతో చెలరేగాడు. ఓపెనర్లు విఫలమైనా.. నమన్ ధిర్ (30), నేహల్ వధేరా(23) జతగా ఇన్నింగ్స్ నిర్మించాడు దూబే. ఒమన్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న ఈ యంగ్‌స్టర్ తొలి టీ20 ఫిఫ్టీతో జట్టును గెలుపు వాకిట నిలిపాడు. విజయానికి రెండు పరుగులు అవసరమైన వేళ కెప్టెన్ జితేశ్ శర్మ(4 నాటౌట్) బౌండరీ కొట్టడంతో 6 వికెట్లతో భారత్ గెలిచింది.
ఏసీసీ పురుషుల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో భారత ఏ జట్టు మళ్లీ గెలుపుబాట పట్టింది. పాకిస్థాన్ ఇచ్చిన షాక్ నుంచి తేరుకున్న టీమిండియా.. దోహాలో ఒమన్‌ను చిత్తుగా ఓడించింది. మొదట ప్రత్యర్థిని 135కే కట్టడి చేసిన భారత్.. అనంతరం లక్ష్యాన్ని 17.5 ఓవర్లలోనే ఛేదించింది. అలాఅనీ ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ(12), ప్రియాన్ష్ ఆర్య(10)లు దంచేయలేదు. బ్యాటింగ్ ఆర్డర్లో ముందొచ్చిన హర్ష్ దూబే(53 నాటౌట్). నమన్ ధిర్(30)లు దూకుడుగా ఆడి జట్టుకు విజయాన్ని కట్టబెట్టారు.
వసీం అలీ(54 నాటౌట్)

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత ఏ జట్టు ఒమన్(Oman)ను తక్కువకే కట్టడి చేసింది. ఆరంభంలో ఓపెనర్ హమ్మద్ మిర్జా(32) మెరుపులకు విజయ్‌కుమార్(1-34 ) చెక్ పెట్టగా.. మిడిల్ ఓవర్లలో సుయాశ్ శర్మ (2-12) పొదుపుగా బౌలింగ్ చేశాడు. అయితే.. ఓవైపు వికెట్లు పడుతున్నా వసీం అలీ(54 నాటౌట్) కెరీర్లో తొలి టీ20 అర్ధ శతకంతో జట్టును ఆదుకున్నాడు. ఫలితంగా ఒమన్ నిర్ణీత ఓవర్లో 135 పరుగులు చేసింది.