అహ్మాదాబాద్: దక్షిణాఫ్రికాతో జరిగిన 5వ టీ20 మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా(Hardik Pandya) దుమ్మురేపిన విషయం తెలిసిందే. ఆ స్టార్ హిట్టర్ వచ్చీ రాగానే ఆ మ్యాచ్‌లో బౌండరీలతో హోరెత్తించాడు. దూకుడు ఇన్నింగ్స్‌తో చెలరేగిపోయాడు. ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్‌గా కొట్టాడు. చాలా బలంగా ఆ షాట్ ఆడాడు పాండ్యా. అయితే సిక్సర్ వెళ్లిన ఆ బంతి.. గ్రౌండ్ చివర మ్యాచ్‌ను షూట్ చేస్తున్న కెమెరామన్‌కు తగిలింది. మిడాఫ్ మీదుగా హార్దిక్ సిక్సర్ బాదాడు. డగౌట్ పక్కన ఉన్న కెమెరామన్ ఎడమ చేతికి బంతి బలంగా తాకింది. దీంతో కాసేపు ఆటను ఆపేశారు. కెమెరామన్‌కు చికిత్స అందించిన తర్వాత మళ్లీ మ్యాచ్‌ను స్టార్ట్ చేశారు.
మ్యాచ్ ముగిసిన తర్వాత హార్దిక్ పాండ్యా ఆ కెమెరామన్ వద్దకు వెళ్లాడు. బంతి తగిలిన ప్రదేశాన్ని చెక్ చేశాడు. ఆ తర్వాత అతనికి హగ్ ఇచ్చాడు. కెమెరామన్ భుజంపై ఐస్ ప్యాక్ అప్లై చేశాడతను. ఈ ఘటనకు చెందిన వీడయో ప్రస్తుతం ఆన్లైన్లో వైరల్ అవుతున్నది. తన స్టంట్తో అందరి గుండెల్ని తాకాడు పాండ్యా. ఇక ఈ మ్యాచ్‌లో పాండ్యా చెలరేగిన తీరు హైలెట్. కేవలం 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు హార్దిక్. తన పవర్ హిట్టింగ్తో సఫారీ బౌలర్లను ఉతికారేశాడు. పాండ్యా ఇన్నింగ్స్‌లో అయిదు సిక్సర్లు, అయిదు ఫోర్లు ఉన్నాయి. తక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన రెండో ఇండియన్ బ్యాటర్‌గా పాండ్యా నిలిచాడు. తిలక్ వర్మ ఈ మ్యాచ్‌లో 73 రన్స్ చేశాడు.
నిర్ణీత 20 ఓవర్లలో ఇండియా 5 వికెట్ల నష్టానికి 231 రన్స్ చేయగా, ఆ టార్గెట్‌తో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 8 వికెట్ల నష్టానికి 201 రన్స్ మాత్రమే చేసింది. భారత బౌలర్లు దక్షిణాఫ్రికాను కట్టడి చేశారు. వరుణ్ చక్రవర్తికి 4 వికెట్లు, బుమ్రాకు 2 వికెట్లు దక్కాయి.
– Hardik Pandya smashed the six
– Ball hit the hard to cameraman
– After the innings, Hardik instantly came to meet him
– Hardik hugged the cameramanJust look at the cameraman’s reaction at the end; it’s so priceless. This small gesture from cricketers can make someone’s day… pic.twitter.com/stV156Og6K
— Tejash (@Tejashyyyyy) December 19, 2025