ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌కు అహ్మదాబాద్ కెప్టెన్‌గా హార్ధిక్ పాండ్యాను ప్రకటించారు. ఈ ఏడాది సీజన్లో కొత్తగా పలు జట్లు ఐపీఎల్లో చేరుతున్న విషయం తెలిసిందే. అహ్మదాబాద్ టీమ్‌లో హార్ధిక్‌తో పాటు రషీద్ ఖాన్, శుభ్‌మన్ గిల్ కూడా తోడయ్యారు. గతంలో ముంబైకి ఆడిన హార్ధిక్‌కు ఇప్పుడు భారీ బాధ్యతను అప్పగించారు. అయితే ఇటీవల జరిగిన ఐసీసీ టీ20 వరల్డ్‌కప్‌లో సరైన పర్ఫార్మెన్స్ ఇవ్వని కారణంగా అతన్ని జాతీయ జట్టు నుంచి తొలగించారు. హార్ధిక్, రషీద్ ఖాన్‌లను 15 కోట్లకు అహ్మదాబాద్ సొంతం చేసుకున్నది. ఇక గిల్ కోసం 8 కోట్లు పెట్టారు. కొత్త ఫ్రాంచైజీతో చేరిన హార్దిక్.. టీ20 టోర్నీలో బౌలింగ్ చేస్తాడో లేదో చూడాల్సిందే. ఇటీవల గాయం తర్వాత అతను బౌలింగ్ చేయడం లేదు. గతంలో హైదరాబాద్ సన్‌రైజర్స్ జట్టుకు ఆడిన ఆఫ్ఘన్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌ను ఈసారి అహ్మదాబాద్ దక్కించుకున్నది. ఇక శుభమన్ గిల్ గతంలో కోల్‌కతా జట్టుకు ఆడాడు.